News June 17, 2024

రేపటి నుంచి తిరుమల సేవా టికెట్లు విడుదల

image

AP: సెప్టెంబర్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ రేపటి నుంచి విడుదల చేయబోతోంది.
* ఆర్జిత సేవా టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్: ఈ నెల 18 ఉ.10 నుంచి 20వ తేదీ ఉ.10 వరకు
*కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు: ఈ నెల 21న ఉ.10 గంటలకు విడుదల
*అంగప్రదక్షిణం టికెట్లు: ఈ నెల 22న ఉ.10 గంటలకు
*రూ.300 స్పెషల్ ఎంట్రీ: ఈ నెల 24న ఉ.10 గంటలకు
*వసతి గదుల కోటా: ఈ నెల 24 మ.3 గంటలకు

Similar News

News November 16, 2025

19న అకౌంట్లలోకి రూ.7,000?

image

AP: PM కిసాన్ పథకంలో భాగంగా ఈ నెల 19న రైతుల ఖాతాల్లో కేంద్రం రూ.2వేల చొప్పున జమ చేయనుంది. అదే రోజు రాష్ట్రంలో ‘అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధులను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ.5వేల చొప్పున అన్నదాతల అకౌంట్లలో జమ చేయనుందని సమాచారం. PM కిసాన్‌తోపాటు ‘సుఖీభవ’ స్కీమ్‌నూ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే AUGలో తొలి విడత నిధులను రిలీజ్ చేశారు.

News November 16, 2025

వంటింటి చిట్కాలు

image

* సమోసా పిండిలో కొద్దిగా బియ్యం పిండిని కలిపితే క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.
* బిర్యానీలోకి ఉల్లిపాయలను వేయించే సమయంలో అందులో చిటికెడు చక్కెర వేస్తే ఉల్లిపాయ కరకరలాడుతుంది. అలాగే వేయించడం కూడా త్వరగా పూర్తవుతుంది.
* కూరల్లో కారం, ఉప్పు ఎక్కువైతే స్పూన్‌ శనగపిండి కలపండి.
* ఓవెన్‌లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచితే.. బ్రెడ్‌ మెత్తగా మంచి రంగులో ఉంటుంది.

News November 16, 2025

హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యం: సీఎం

image

AP: సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. దానిపై నియంత్రణ అవసరమని పేర్కొన్నారు. హెల్తీ హ్యాపీ సొసైటీ స్థాపనే రాజ్యాంగ లక్ష్యమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75ఏళ్లయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో భారత్ అన్ని రంగాల్లో నిపుణులను అందిస్తుందని, 2047 కల్లా ప్రపంచంలోనే ప్రభావవంతమైన దేశంగా మారుతుందని చెప్పారు.