News January 9, 2025
తిరుమల తొక్కిసలాట.. తప్పెవరిది?

AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. ఈ ఘటనలో తప్పెవరిది అనేదానిపై చర్చ జరుగుతోంది. టికెట్లు దొరకవేమోనన్న కంగారుతో భక్తులు ఒక్కసారిగా తోపులాడుకోవడం వారి తప్పు. ఒకేసారి గేట్లు తెరవడం పోలీసుల తప్పు. టికెట్ల జారీపై నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడం, ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే అంచనా వేయలేకపోవడం టీటీడీ తప్పు అని చర్చ జరుగుతోంది.
Similar News
News November 26, 2025
NGKL: రేపటి నుంచి సర్పంచ్ నామినేషన్ల స్వీకరణ

నాగర్కర్నూల్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ గురువారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, వంగూరు, తెలకపల్లి, తాడూరు మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
News November 26, 2025
బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.
News November 26, 2025
పుల్లోరం వ్యాధితో కోళ్లకు ప్రమాదం

వైరస్, సూక్ష్మజీవుల వల్ల కోళ్లలో పుల్లోరం వ్యాధి సోకుతుంది. కోడి పిల్లల్లో దీని ప్రభావం ఎక్కువ. తల్లి నుంచి పిల్లలకు గుడ్ల ద్వారా సంక్రమిస్తుంది. రోగం సోకిన కోడిపిల్లలు గుంపులుగా గుమికూడటం, శ్వాసలో ఇబ్బంది, రెక్కలు వాల్చడం, మలద్వారం వద్ద తెల్లని రెట్ట అంటుకోవడం వంటి లక్షణాలుంటాయి. కోడిని కోసి చూస్తే గుండె, కాలేయం, పేగులపై తెల్లని మచ్చలు కనిపిస్తాయి. నివారణకు వెటర్నరీ డాక్టర్ సలహాలను పాటించాలి.


