News August 28, 2025

సెప్టెంబర్ 7న తాత్కాలికంగా తిరుమల ఆలయం మూసివేత

image

AP: చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబర్ 7న తిరుమల ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఆ రోజున మధ్యాహ్నం 3.30 గంటలకు ఆలయం తలుపులు మూసి, సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 3 గంటలకు తిరిగి ఓపెన్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7న ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. 8న ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.

Similar News

News August 29, 2025

అందుకే టాలీవుడ్‌కు దూరమయ్యా: కమలినీ ముఖర్జీ

image

ఆనంద్, గోదావరి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ కమలిని ముఖర్జీ టాలీవుడ్‌కు దూరమై దశాబ్దం దాటింది. ఓ సినిమాలో పోషించిన పాత్ర తాను ఊహించిన స్థాయిలో తెరకెక్కకపోవడమే ఈ దూరానికి కారణమని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ క్యారెక్టర్‌పై అసంతృప్తి కలిగి తెలుగు చిత్రాల్లో నటించట్లేదని చెప్పారు. అయితే ఆ మూవీ పేరును వెల్లడించలేదు. చివరగా ఈ బ్యూటీ తెలుగులో ‘గోవిందుడు అందరివాడే’లో నటించారు.

News August 29, 2025

రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు పెంచనున్న భారత్

image

అమెరికా టారిఫ్ ఆంక్షలు విధించినా భారత్ మాత్రం వెనుకడుగు వేయట్లేదు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు మరింత పెంచేందుకు సిద్ధమైనట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఆగస్టుతో పోల్చితే వచ్చే నెలలో 10-20% అదనంగా కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్ దాడులతో మాస్కోలో రిఫైనరీలు దెబ్బతినగా ధరలు కూడా తగ్గే అవకాశమున్నట్లు సమాచారం. పశ్చిమదేశాల ఆంక్షలతో రష్యాకు భారత్ అతిపెద్ద ఆయిల్ కొనుగోలుదారుగా మారింది.

News August 29, 2025

ఆగస్టు 29: చరిత్రలో ఈ రోజు

image

1863 : తెలుగు భాషావేత్త గిడుగు రామమూర్తి జననం(ఫొటో)
1905 : భారత హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ జననం(ఫొటో)
1923 : భారత మాజీ క్రికెటర్ హీరాలాల్ గైక్వాడ్ జననం
1928 : నటి, గాయని రావు బాలసరస్వతీ దేవి జననం
1958 : మైకల్ జాక్సన్ జననం
1959: అక్కినేని నాగార్జున జననం
2018 : నందమూరి హరికృష్ణ మరణం
* తెలుగు భాషా దినోత్సవం
* జాతీయ క్రీడా దినోత్సవం