News February 22, 2025

Tirumala Update: రద్దీ సాధారణం

image

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు దర్శనానికై వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,327మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 22,804మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి రూ.3.52 కోట్ల ఆదాయం లభించింది.

Similar News

News January 10, 2026

‘గోవిందా!’ అని అందామా?

image

గోవింద నామమంటే శ్రీవారికి ఎంతో ఇష్టం. ‘గో’ అంటే గోవులే కాదు! వేదాలు, కిరణాలు, సమస్త జీవులని అర్థం. జీవులందరినీ జ్ఞానంతో, ఆహారంతో పోషించేవాడే గోవిందుడు. ఓసారి అగస్త్యుడు ఆవును తీసుకోమని ‘గో ఇంద’ (ఆవును తీసుకో) అని స్వామిని పిలవగా ఆ పిలుపే ‘గోవింద’ నామంగా మారిందని పురాణ గాథ. భక్తితో ఒక్కసారి గోవిందా అని పిలిస్తే, ఆయన ఏడుకొండలు దిగి వచ్చి మనల్ని ఆదుకుంటాడు. గోవింద నామ స్మరణ మోక్షానికి సులభ మార్గం.

News January 10, 2026

శబరిమల వెళ్లే భక్తులకు అలర్ట్

image

మకరజ్యోతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు శబరిమలకు వచ్చే అవకాశం ఉండటంతో కేరళ పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 12 నుంచి పంబాలో వాహనాల పార్కింగ్‌కు అనుమతి లేదని తెలిపారు. ఇక జనవరి 14న ఉదయం 9 గంటల తర్వాత నీలక్కల్ నుంచి పంబాకు, అదే రోజున ఉదయం 10 గంటల నుంచి పంబా-సన్నిధానం వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అయ్యప్ప భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేశారు.

News January 10, 2026

ధనుర్మాసం: ఇరవై ఆరో రోజు కీర్తన

image

‘ఓ వటపత్రశాయీ! వ్రతం కోసం నీ చెంతకు వచ్చాము. మా పూర్వీకులు నడిచిన బాటలో ఈ వ్రతానికి కావాల్సిన పరికరాలను ప్రసాదించమని వేడుకుంటున్నాము. నీ పాంచజన్యం వంటి తెల్లని శంఖాలు, వాద్యాలు, మంగళ గానాలు పాడే భక్తుల సమూహం మాకు కావాలి. వెలుగునిచ్చే మంగళ దీపాలు, వ్రత ధ్వజాలు అనుగ్రహించు. లోకాన్నంతా నీ కుక్షిలో ఉంచుకోగల నీకు ఇవి ఇవ్వడం కష్టమేం కాదు. కరుణించి మా వ్రతం విజయవంతమయ్యేలా దీవించు స్వామీ!’ <<-se>>#DHANURMASAM<<>>