News September 21, 2024
తిరుపతి లడ్డూ వివాదం ఫేక్ కావొచ్చు: TMC ఎంపీ

తిరుపతి లడ్డూ వివాదం బీజేపీ వ్యాప్తి చేసిన కల్పితం కావొచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే అనుమానాలు వ్యక్తం చేశారు. ‘బీజేపీ ఎగ్జిట్ పోల్స్ టైమ్లో స్టాక్ మార్కెట్ అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. దాంతో హెరిటేజ్ షేర్లపై CBN కుటుంబానికి రూ.1200 కోట్ల లాభం వచ్చింది. తిరుపతి లడ్డూ తయారీలో వాడిన నెయ్యిపై ఆరోపణలు చేసిన సీఎంకు ఓ డెయిరీ రాజ్యం ఉండటం కాకతాళీయమేనా?’ అని సందేహం వ్యక్తం చేశారు.
Similar News
News November 22, 2025
రబీ వరి.. ఇలా నాటితే అధిక దిగుబడి

వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. బెంగాలీ కూలీలు వరి నారును వరుస పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య 6-8 అంగుళాల దూరం ఉండేలా నాటి.. 9 వరుసలకు ఒక కాలిబాట తీస్తున్నారు. దీని వల్ల మొక్కల మధ్య గాలి, వెలుతురు బాగా తగిలి, చీడపీడల ఉద్ధృతి తగ్గి దిగుబడి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ఎకరాకు 15KGల విత్తనం చాలు. కూలీల ఖర్చు కూడా తగ్గడంతో పెట్టుబడి తగ్గుతుంది. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News November 22, 2025
మహిళలు ఎక్కువ గంటలు పని చేస్తే?

కెరీర్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఎక్కువ గంటలు పనిచేసే మహిళలకు ఒత్తిడి, ఆందోళన పెరిగి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం జరగడం, ప్రీమెచ్యూర్ బేబీ, ఎదుగుదల లోపాలు, ప్రీఎక్లాంప్సీయా ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గినా.. ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు.
News November 22, 2025
రీసర్వే.. అభ్యంతరాల పరిష్కారానికి రెండేళ్ల గడువు: RRR

AP: భూముల రీసర్వేపై రైతుల అభ్యంతరాల పరిష్కారానికి MRO స్థాయిలో ప్రస్తుతం ఏడాది గడువు ఉంది. దీన్ని రెండేళ్లకు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని Dy.స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. 16వేల గ్రామాలకుగాను ఇప్పటికి 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యిందన్నారు. 7 లక్షల అభ్యంతరాలురాగా 2 లక్షల అభ్యంతరాలు పరిష్కారమయ్యాయని చెప్పారు. రీసర్వేను 2027 DECలోగా పారదర్శకంగా పూర్తిచేస్తామని పేర్కొన్నారు.


