News March 17, 2024
తిరుపతి: పరీక్షా ఫలితాల విడుదల

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్‌లో 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ(MBA) 6వ సెమిస్టర్, 2, 4 సప్లమెంటరీ పరీక్షలు జరిగాయి. నవంబర్‌లో బీఫార్మసీ 4, 6 సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Similar News
News February 1, 2026
జాతీయస్థాయి కోకో జట్టుకు తీర్థం విద్యార్థుల ఎంపిక

జాతీయస్థాయి ఖోఖో జట్టుకు తీర్థం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు హెచ్ఎం లక్ష్మీపతి తెలిపారు. జనవరి 22న జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాఠశాలకు చెందిన గంగాధర్, యశ్వంతి పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచారు. దీంతో వారు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి 35వ సబ్ జూనియర్ ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని HM, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
News February 1, 2026
CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు

CM చంద్రబాబు పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పర్యటనలో పార్టీ క్యాడర్‌తో సమావేశం మాత్రమే ఉండగా.. మధ్యాహ్నం 2 గం.తర్వాత CM తిరుగు ప్రయాణం కావలసి ఉంది. అయితే క్యాడర్‌తో సమావేశాల తర్వాత ఇంటికి వెళ్లి అక్కడ నుంచి అబకల దొడ్డిలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 4:40 గం.కు తుమిసి హెలిప్యాడ్ నుంచి HYD వెళ్లనున్నారు.
News February 1, 2026
చిత్తూరు: 27 వేల మంది పాడి రైతులకు లబ్ధి

జిల్లాలో 19న మొదలైన ఉచిత పశు వైద్యశిబిరాలు శనివారంతో ముగిశాయి. చివరి రోజున 37 శిబిరాలు నిర్వహించగా.. 13 రోజుల్లో 718 గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించినట్లు జేడీ ఉమామహేశ్వరి తెలిపారు. మొత్తంగా 88,303 పశువులు, మేకలు, గొర్రెలు, కోళ్లకు వైద్య సేవలు అందించడంతో 27,656 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరినట్లు జేడీ వివరించారు.


