News October 1, 2024

తిరుపతిని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి: కేఏ పాల్

image

AP: తిరుమల తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తప్పేంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ప్రశ్నించారు. వాటికన్ సిటీని దేశంగా ప్రకటించినట్లే తిరుమలనూ UT చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికల హామీల దృష్టి మరల్చేందుకే లడ్డూ వివాదం సృష్టించారు. చంద్రబాబు అసలు హిందువే కాదు.. నాస్తికుడు. పవన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారు. లడ్డూపై రాజకీయ ప్రచారం ఆపాలి’ అని ఆయన ఫైర్ అయ్యారు.

Similar News

News November 26, 2025

సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణి

image

జగన్ బీఫామ్ ఇస్తే 40 మంది కార్పొరేటర్లు గెలిచారనీ.. ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం టీడీపీలో ఉన్నారని మాజీ మంత్రి కాకాణి మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టిన వైసీపీని వీడి.. వారు కూర్చున్న చెట్టును వారే నరుక్కుంటున్నారని వెల్లడించారు. మేయర్ చేత వైసీపీకి రాజీనామా చేయించి కనీసం టీడీపీలోకి తీసుకోలేదన్నారు. కార్పొరేటర్లకు దమ్ముంటే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు.

News November 26, 2025

వచ్చే ఏడాది చివరికి కిలో వెండి రూ.6 లక్షలు: కియోసాకి

image

బంగారం, వెండి ధరలు భవిష్యత్తులో మరింతగా పెరుగుతాయని రచయిత, బిజినెస్‌మ్యాన్ రాబర్ట్ కియోసాకి అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో 50 డాలర్లుగా ఉన్న ఔన్స్ వెండి ధరలు త్వరలోనే 7 డాలర్లకు పెరగవచ్చని, వచ్చే ఏడాది చివరికి 200 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌లో రూ.1.55 లక్షలు ఉన్న కిలో వెండి ధర రూ.6.2 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది.

News November 26, 2025

వేరుశనగ పంటకు నీటిని ఏ సమయంలో అందించాలి?

image

వేరుశనగను విత్తే ముందు నేల తడిచేలా నీరు పెట్టి తగినంత పదును ఉన్నప్పుడు విత్తనం వేసుకోవాలి. మొదటి తడిని మొలక వచ్చిన 20-25 రోజులకు ఇవ్వాలి. దీని వల్ల పైరు ఒకేసారి పూతకు వచ్చి, ఊడలు కూడా సరిగా ఏర్పడి దిగుబడి బాగుంటుంది. తర్వాత నేల లక్షణం, బంక మట్టి శాతాన్ని బట్టి 7-10 రోజులకు ఒక నీటి తడినివ్వాలి. చివరి తడిని పంట కోతకు 4-7 రోజుల మధ్య అందించాలి. దీని వల్ల మొక్కలు పీకడం సులభం. గింజలు నేలలో ఉండిపోవు.