News January 9, 2025

తిరుపతి తొక్కిసలాట.. సీఎం రాజీనామా చేయాలి: రోజా

image

AP: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురి చావుకు కారణమైన సీఎం చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగాన్ని సీఎం పర్యటనకు వినియోగించుకున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి సామాన్యులంటే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో టీటీడీ ఛైర్మన్, ఈవో, ఎస్పీ, ఇతర అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరపాలన్నారు.

Similar News

News December 4, 2025

WGL: పెరిగిన వండర్ హట్, తగ్గిన తేజా మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌‌లో గురువారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకు బుధవారం రూ.19 వేలు ధర రాగా, ఈరోజు రూ.19,300 అయింది. 341 రకం మిర్చికి నిన్న రూ.16,500 ధర రాగా, నేడు కూడా అదే దర వచ్చింది. అలాగే తేజ మిర్చి బుధవారం రూ.14,200 పలకగా, ఈరోజు కూడా అదే ధర వచ్చింది. కొత్త తేజ మిర్చి నిన్న రూ.14,800 ధర వస్తే నేడు రూ.14,200కి పడిపోయింది.

News December 4, 2025

ఇంటర్వ్యూతో ICSILలో ఉద్యోగాలు

image

ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<>ICSIL<<>>)6 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 9 వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.590. నెలకు జీతం రూ.24,356 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://icsil.in

News December 4, 2025

పెప్లమ్ బ్లౌజ్‌ని ఇలా స్టైల్ చేసేయండి

image

సాధారణంగా పెప్లమ్ టాప్స్ జీన్స్‌పైకి సూట్ అవుతాయి. కానీ దీన్ని ఎత్నిక్ వేర్‌గా ట్రై చేస్తే మోడ్రన్ టచ్ ఇస్తుంది. పెప్లమ్ టాప్స్‌ను చీరలతో స్టైల్ చేసి ట్రెండీ లుక్ సొంతం చేసుకోవచ్చు. పార్టీల్లో, ఫంక్షన్లలో అందరి దృష్టిని ఆకర్షించాలంటే, జాకెట్ స్టైల్ పెప్లమ్ బ్లౌజ్‌తో చీరను మ్యాచ్ చేస్తే సరిపోతుంది. పెప్లమ్ బ్లౌజ్ వేసుకుంటే పల్లు లోపలికి తీసుకుంటారు. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.