News April 14, 2024

హార్దిక్ పాండ్యపై తివారీ సంచలన కామెంట్స్

image

IPLలో అంతగా రాణించలేకపోతున్న హార్దిక్ పాండ్యాపై మాజీ ప్లేయర్ మనోజ్ తివారీ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్దిక్ బౌలింగ్ పేలవంగా ఉందని విమర్శించారు. ప్రస్తుత ఫామ్‌తో టీ20 వరల్డ్ కప్‌కు పాండ్యా ఎంపిక కావడం కష్టమని అభిప్రాయపడ్డారు. అతనికి ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబేను ఎంపిక చేయాలని సూచించారు. అయితే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ రాణిస్తేనే దూబే వరల్డ్ కప్‌కి ఎంపిక కాగలరని వ్యాఖ్యానించారు.

Similar News

News March 24, 2026

TODAY HEADLINES

image

☛ కొవిడ్‌ తరహాలోనే యుద్ధం వల్ల ఏర్పడే సవాల్‌నూ ఎదుర్కొందాం: PM మోదీ
☛ ఏపీలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
☛ 7 బిల్లులకు TG క్యాబినెట్ ఆమోదం
☛ మూసీ ప్రక్షాళన అత్యవసరం.. విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: CM రేవంత్
☛ ₹10వేలకు పైగా తగ్గిన బంగారం ధర
☛ ఇరాన్‌తో యుద్ధానికి 5 రోజుల విరామం: ట్రంప్
☛ యుద్ధంలో US-ఇజ్రాయెల్ ఓడాయి: ఇరాన్

News March 24, 2026

తమిళనాడులో హోరాహోరీ తప్పదా?

image

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పదని VoteVibe ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. CNN-News18 రిలీజ్ చేసిన సర్వే ప్రకారం 234 సీట్లున్న అసెంబ్లీలో DMK, INC, CPI, CPM కలిసి 113-123 సీట్లు గెలిచే అవకాశం ఉంది. AIADMK, BJP కూటమి 106-116 స్థానాల్లో విజయం సాధించే ఛాన్స్ ఉంది. విజయ్ పార్టీ TVK 2-8 సీట్లకే పరిమితమవుతుందని పేర్కొంది. 39%మందిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు చెప్పింది.
#ELECTIONS2026

News March 24, 2026

రీ-రిలీజ్ ట్రెండ్.. మరోసారి థియేటర్లలోకి స్టార్ల సినిమాలు

image

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ప్రభాస్, కాజల్ జంటగా నటించిన ‘డార్లింగ్’ APR 23న మరోసారి థియేటర్లలోకి రానుంది. Jr.NTR బర్త్‌డే సందర్భంగా మే 20న ‘ఊసరవెల్లి’, ‘ఆంధ్రావాలా’ స్పెషల్ షోలు వేయనున్నారు. APR 8న అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ‘రేసు గుర్రం’ రీ-రిలీజ్ కానుంది. మహేశ్ బాబు నటించిన ‘అతిథి’ మే 29న, ‘పోకిరి’ AUGలో మరోసారి థియేటర్లలో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.