News August 5, 2024
TLF నూతన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా వెంకట్ రెడ్డి
తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(TLF) నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కత్తి వెంకటస్వామి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మోహన్ రెడ్డి, కరుణాకర్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా విజేత వెంకట్ రెడ్డి, MBNR-మల్లేష్ , GDWL-డాక్టర్ మహేందర్,NGKL-సత్యం,NRPT-అశోక్ గౌడ్,WNPT-డాక్టర్ చంద్రశేఖర్ లను ఆయా జిల్లాలకు అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
Similar News
News September 15, 2024
MBNR: షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే
మహబూబ్‌నగర్ పట్టణంలో షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే చేపట్టినట్లు సీఐటీయూ జిల్లా కోశాధికారి బి.చంద్రకాంత్, టౌన్ కన్వీనర్ రాజ్ కుమార్ ఆదివారం తెలిపారు. మాల్స్, రైల్వే కార్మికుల్లో నాన్ ఎంప్లాయిమెంట్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వివరించారు.
News September 15, 2024
MBNR: వెంకన్న సన్నిధిలో కలెక్టర్ సంతోష్
బిజినేపల్లి మండలం వట్టెం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నాగర్‌కర్నూలు కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాద్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్‌కు స్వాగతం పలుకగా, అర్చకులు శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆలయ పరిసరాలను 2గంటల పాటు పరిశీలించారు.
News September 15, 2024
MBNR: రైతుకు’భరోసా’వచ్చేనా?
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం ద్వారా పలువురు రూ.కోట్లు అందుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కేవలం సాగు పొలాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతులకు రాష్ట్ర సర్కారు రైతు భరోసా ద్వారా తీపికబురు చెప్పేందుకు కార్యచరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమయింది.