News June 4, 2024

బెంగాల్‌లో ఆధిక్యంలోకి టీఎంసీ

image

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ లీడింగ్‌లో కొనసాగుతోంది. 42 స్థానాల్లో TMC 24 చోట్ల ఆధిక్యంలో ఉంది. మరోవైపు బీజేపీ 16 చోట్ల, కాంగ్రెస్ కూటమి 2 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో టీఎంసీ 22 స్థానాలు, బీజేపీ 18 సీట్లు, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Similar News

News January 15, 2026

రూ.1,499కే ఇండిగో విమాన టికెట్

image

విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది. ‘Sail into 2026’ పేరుతో దేశీయ రూట్లలో ఒకవైపు విమాన టికెట్ ధరను కేవలం రూ.1,499గా నిర్ణయించింది. అంతర్జాతీయ ప్రయాణాలకు ప్రారంభ ధర రూ.4,499గా వెల్లడించింది. ఈ ఆఫర్ ఈ నెల 16 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 20 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది.

News January 15, 2026

NIA కొత్త సారథిగా రాకేశ్‌ అగర్వాల్‌ నియామకం

image

కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) కీలక భద్రతా విభాగాలకు కొత్త చీఫ్‌లను నియమించింది. 1994 బ్యాచ్ IPL అధికారి రాకేశ్ అగర్వాల్‌ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్ జనరల్‌గా నియామకం అయ్యారు. ఆయన పదవీకాలం 2028 ఆగస్టు వరకు కొనసాగనుంది. మరోవైపు హరియాణా మాజీ DGP శత్రుజీత్ సింగ్ కపూర్‌ను ITBP డీజీగా నియమించింది. ప్రస్తుతం ఐటీబీపీ డీజీగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌కు బీఎస్‌ఎఫ్ DGగా బాధ్యతలు అప్పగించింది.

News January 15, 2026

ట్రంప్ ఆదేశిస్తే ఇరాన్‌పై దాడి ఖాయం!

image

ఇరాన్‌పై దాడి చేసే పలు మార్గాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశిస్తే ఏ క్షణమైనా దాడి జరగొచ్చని తెలుస్తోంది. ఇందులో ముఖ్యంగా అమెరికా సైనిక స్థావరాల నుంచి వైమానిక దాడులు, సముద్ర మార్గం ద్వారా క్షిపణి దాడులు, డ్రోన్ దాడులు, సైబర్ వార్, సీక్రెట్ ఆపరేషన్ లేదా కీలక మౌలిక సదుపాయాలపై దాడులు వంటి ఆప్షన్లు ఉన్నట్లు సమాచారం.