News August 21, 2024
వైద్యుల ఆందోళనను జవాన్లతో ముడిపెట్టిన TMC

వైద్యురాలిపై హత్యాచారానికి నిరసగా ఆందోళన చేస్తున్న వైద్యవర్గాలను ఎలా సముదాయించాలో TMCకి అర్థమవ్వడం లేదు. అందుకే జవాన్లతో పోలిక పెట్టింది. ‘సమ్మెను ఆపాలని కోరుతున్నాం. మీకో ప్రశ్న. పుల్వామా ఘటనలో అసలు న్యాయమే జరగలేదు. అలాగని జవాన్లు సరిహద్దుల్ని వదిలేసి వీ వాంట్ జస్టిస్ అంటూ నిరసనకు దిగితే ఎలా ఉంటుందో చెప్పండి’ అని TMC నేత కునాల్ ఘోష్ అన్నారు. ఆర్జీకర్ ఘటనపై పార్టీ వైఖరేంటో ఆయనే వివరిస్తున్నారు.
Similar News
News November 17, 2025
న్యూస్ రౌండప్

⋆ కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాల్లో భక్తుల రద్దీ
⋆ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
⋆ నేడు మ.3 గంటలకు TG క్యాబినెట్ సమావేశం.. స్థానిక సంస్థల ఎన్నికలు, అందెశ్రీ స్మృతి వనం, అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై నిర్ణయం తీసుకోనున్న మంత్రివర్గం
⋆ నేడు T BJP నేతల కీలక భేటీ.. స్థానిక ఎన్నికల వ్యూహాలపై చర్చ
⋆ లాయర్ వామనరావు దంపతుల హత్య కేసులో నేడు CBI విచారణకు పుట్ట మధు
News November 17, 2025
నువ్వుల పంట కోతకు వచ్చిందా?

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.
News November 17, 2025
ఏపీలో టంగ్స్టన్ తవ్వకాలు.. HZLకు లైసెన్స్

ఏపీలో టంగ్స్టన్ బ్లాక్లను కనుగొని తవ్వకాలు జరిపేందుకు హిందుస్థాన్ జింక్ లిమిటెడ్(HZL) సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందినట్లు సంస్థ తెలిపింది. క్రిటికల్, స్ట్రాటజిక్ మినరల్స్ అన్వేషణలో దేశం స్వయంప్రతిపత్తి సాధించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని వెల్లడించింది. లైటింగ్ ఫిలమెంట్లు, రాకెట్ నాజిల్స్, ఎలక్ట్రోడ్లు, రేడియేషన్ షీల్డ్ల తయారీలో టంగ్స్టన్ను వాడతారు.


