News May 15, 2024
ఎన్నికల సంఘానికి TMC MP సవాల్
బెంగాల్‌కు చెందిన TMC MP మహువా మొయిత్రా ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. తాను పోటీ చేసిన కృష్ణానగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలైన ఓట్ల వివరాలను ఆమె పంచుకున్నారు. తానే చేయగలిగినప్పుడు ఎన్నికల సంఘం ఎందుకు ఇలా డేటా విడుదల చేయలేకపోతోందని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఓ బీబీసీ జర్నలిస్టు.. ఇలాగే మిగిలిన అభ్యర్థులంతా ఓటింగ్ వివరాలు పంచుకుంటే ఎన్నికల సంఘానికి పని సులువు అవుతుందని అభిప్రాయపడ్డారు.
Similar News
News January 4, 2025
రోహిత్ సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్‌లో లేడేమో: గవాస్కర్
భారత సెలక్టర్ల ఫ్యూచర్ ప్లాన్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ లేడేమోనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. రానున్న రోజుల్లో జట్టులో భారీ మార్పులు జరుగుతాయని ఆయన జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం శర్మ వయసు 37. వచ్చే WTC ఫైనల్ నాటికి 41కి చేరుకుంటారు. ఆ వయసులో ఆయన టెస్టులు ఆడడం అనుమానమే. అందుకే ఆయన స్థానంలో యంగ్ లీడర్‌షిప్‌ను బీసీసీఐ తయారు చేస్తుందేమో’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
News January 4, 2025
ఇజ్రాయెల్‌పైకి గాజా రాకెట్ల దాడి
తమపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్‌పైకి గాజా యంత్రాంగం రాకెట్లతో ప్రతిదాడి చేసింది. తమ భూభాగం లక్ష్యంగా గాజా వైపునుంచి 3 రాకెట్ల దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది కొనసాగితే తమ దాడుల తీవ్రతను మరింత పెంచుతామని హెచ్చరించింది. మరోవైపు ఇజ్రాయెల్ తాజా దాడులు 16మంది పాలస్తీనా పౌరుల్ని బలితీసుకున్నాయని గాజా యంత్రాంగం వెల్లడించింది.
News January 4, 2025
HMPV.. డేంజర్ లేదన్నారంటే ప్రమాదమే: నెటిజన్ల మీమ్స్
చైనాలో విస్తరిస్తోన్న HMPV ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. అయితే దాంతో ప్రమాదం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్పడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 2020లో కరోనా గురించి కూడా ఇలానే చెప్పారంటూ పోస్టులు చేస్తున్నారు. వాళ్ల ప్రకటన తర్వాత నిజంగా భయమేస్తోందని పలువురు పేర్కొంటున్నారు. 2020, 2025 జనవరి క్యాలెండర్లు ఒకేలా ఉన్నాయంటున్నారు. అప్రమత్తంగా ఉండటమే మంచిదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు?