News January 30, 2026
TMC or BJP: బెంగాల్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే?

ఇప్పటికిప్పుడు LS ఎన్నికలు జరిగితే బెంగాల్‌లో TMC 28, BJP 14 స్థానాల్లో గెలుస్తాయని ‘India Today’ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేలింది. 2024 ఎలక్షన్స్‌లో TMC 29, BJP 12 సీట్లు గెలిచాయి. అయితే గతేడాది AUG సర్వేలో TMC 31, BJPకి 11 సీట్లు రాగా ఇప్పుడు కమలం పార్టీకి మెజార్టీ పెరగడం గమనార్హం. అదే సమయంలో TMC సీట్లు తగ్గాయి. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు ఖాయం కానుంది.
Similar News
News February 13, 2026
ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్!

AP: చేనేతలందరికీ ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు శాసనమండలిలో వెల్లడించారు. చేనేత వృత్తిలో ఉన్న వారందరూ అర్హులేనని పేర్కొన్నారు. మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో మగ్గం నేతన్నలకు ఏడాదికి రూ.8,640, మర మగ్గం నేతన్నలకు రూ.21,600 ఆదా కానుందని మంత్రి చెప్పారు.
News February 13, 2026
కానిస్టేబుల్ సస్పెండ్.. గెలిచిన భార్య!

TG: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారనే ఆరోపణలతో సస్పెండైన కానిస్టేబుల్ భార్య గెలిచారు. సిద్దిపేట(D) చేర్యాల మున్సిపాలిటీ 2వ వార్డులో BRS తరఫున గీతాంజలి పోటీ చేశారు. ఆమె భర్త రమేశ్ కొమురవెళ్లి PSలో కానిస్టేబుల్. ప్రచారంలో పాల్గొన్నారని ఫిర్యాదు వెళ్లడంతో విధుల నుంచి రమేశ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో గీతాంజలి కాంగ్రెస్ అభ్యర్థి ముస్త్యాల తేజపై 223 ఓట్ల తేడాతో గెలిచారు.
News February 13, 2026
T20WC: USA భారీ స్కోర్

చెన్నై వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో USA చెలరేగి ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 రన్స్ చేసింది. ముక్కమల్ల సాయితేజ 79 పరుగులతో సత్తా చాటారు. మరోవైపు శుభమ్ 24 బంతుల్లోనే 48 రన్స్ చేశారు. 3 ఫోర్లు, 2 సిక్సులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే 3 వికెట్లు తీశారు.


