News July 28, 2024

TML: ఆగస్టులో జరిగే ఉత్సవాలు ఇవే

image

9న గరుడ పంచమి, తిరుమల శ్రీవారి గరుడ సేవ. 10న కల్కి జయంతి. 13న తరిగొండ వెంగమాంబ వర్ధంతి. 14న తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ. 15న స్వాతంత్య్ర దినోత్స‌వం. స్మార్త ఏకాదశి. 15 నుంచి 17వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు. 16న వరలక్ష్మీ వ్రతం. 19న శ్రావణ పౌర్ణమి. గరుడ సేవ. 27న శ్రీ‌కృష్ణాష్ట‌మి, తిరుమ‌ల శ్రీ‌వారి ఆస్థానం.

Similar News

News February 21, 2026

చిత్తూరు: పోలీసుల శ్రమదానం

image

స్వచ్ఛ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేద్దామని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ పిలుపునిచ్చారు. ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం శ్రమదానం చేశారు. ఎస్పీ సూచనల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. స్టేషన్ పరిసరాలను శుభ్రం చేశారు. మొక్కలు నాటారు.

News February 21, 2026

చిత్తూరు జిల్లా రైతులకు గమనిక

image

ప్రభుత్వం రైతు విశిష్ట సంఖ్య కోసం నమోదు ప్రక్రియ చేపట్టింది. చిత్తూరు జిల్లాలో 2.55 లక్షల మంది రైతులు ఉండగా 2లక్షల మంది వివరాలే ఇప్పటికీ నమోదయ్యాయి. పీఎం కిసాన్, పంట నష్టం, బీమా, భూసార పరీక్షలు, విత్తనాల పంపిణీకి ఈ సంఖ్య ఎంతో ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నంబర్ లేకపోతే పథకాలు రావు.

News February 21, 2026

చిత్తూరులో బర్డ్ ప్లూ.. మనుషులకు సోకలేదు!

image

చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో మనుషులెవరికీ బర్డ్ ప్లూ సోకలేదని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండియన్ స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి వ్యాధి సోకిందనే ప్రచారం అవాస్తవమన్నారు. 54 మంది అనుమానితుల శాంపిల్స్ పరీక్షలకు పంపగా నెగిటివ్గా తేలిందన్నారు. వ్యాధి సోకకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించారు.