News November 6, 2025
TML: 7న డయల్ యువర్ TTD ఈవో

తిరుమలలో ఈనెల 7న ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ టీటీడీ ఈవో జరగనుంది. శ్రీవారి భక్తులు తమ సందేహాలు, సూచనలను ఈవో అనిల్‌కుమార్ సింఘాల్‌కు ఫోన్ ద్వారా నేరుగా చెప్పవచ్చు. ఆ రోజు భక్తులు 0877-226326కు కాల్ చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
Similar News
News March 21, 2026
అనకాపల్లి: స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో 4గురు కేంద్ర మంత్రులు

నక్కపల్లిలో ఈనెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదగా జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో నలుగురు కేంద్ర మంత్రులు పాల్గొనున్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయానా శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ,పి. చంద్రశేఖర్ పాల్గొనున్నారు. వీరితో పాటు స్టీల్ కార్యదర్శి సందీప్ పాండ్రిక్ హాజరవుతారు.
News March 21, 2026
తమిళనాడులో AIADMKదే పైచేయి?

తమిళనాడు ఎన్నికల్లో ఈసారి AIADMKదే పైచేయి అని IANS సర్వే పేర్కొనడం చర్చనీయాంశమైంది. AIADMK కూటమికి 39-40% ఓట్ షేర్ రావొచ్చని.. ఫలితంగా 234 స్థానాల్లో 114-127 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది. DMK కూటమికి 104-114 సీట్లు (37-38% ఓట్ షేర్) దక్కొచ్చని పేర్కొంది. ఇక విజయ్ TVKకి 6-12 సీట్లు (14-15% షేర్) రావొచ్చని, అనేక స్థానాల్లో TVK కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చింది. <<-se>>#Elections2026<<>>
News March 21, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.


