News January 25, 2026
TNలో హిందీకి స్థానం లేదు: CM స్టాలిన్

రాష్ట్రంలో హిందీ భాషకు ఎప్పుడూ స్థానం లేదని, ఫ్యూచర్‌లోనూ ఉండబోదని TN CM స్టాలిన్ చెప్పారు. తమిళ భాషను ప్రజలంతా ప్రేమిస్తారని దానిని మరుగుపరిచే చర్యలను ఉపేక్షించబోమన్నారు. హిందీని బలవంతంగా రుద్దాలని చూసిన ప్రతిసారీ తమిళులు నిరసన వ్యక్తం చేశారని చెప్పారు. 1965లో TNలో జరిగిన హిందీ వ్యతిరేక నిరసనల్లో మరణించిన వారి త్యాగాలకు గుర్తుగా నిర్వహించిన తమిళ భాషా అమరవీరుల దినోత్సవంలో ఈ కామెంట్స్ చేశారు.
Similar News
News February 20, 2026
26న టీమ్ ఇండియా Vs జింబాబ్వే.. తేలిగ్గా తీసుకుంటే..

T20WC: ఆస్ట్రేలియా, శ్రీలంక లాంటి పెద్ద జట్లపై విజయాలతో జింబాబ్వే జోరు మీదుంది. ఈ నెల 26న సూపర్-8లో భాగంగా టీమ్ ఇండియాతో తలపడనుంది. దీంతో ఆ జట్టును ఈజీగా తీసుకోవద్దని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా ఓపెనర్ బెన్నెట్, ఆల్‌రౌండర్ సికందర్ రజా ఆ టీమ్‌కు వెన్నుముకలా మారారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని రంగాల్లో అదుర్స్ అనిపిస్తున్నారు.
News February 20, 2026
కొత్త బాస్‌లు వీరేనా?

TG: వచ్చేనెలలో CS రామకృష్ణారావు పదవీకాలం ముగియనుండగా వికాస్ రాజ్, జయేశ్ రంజన్, సవ్యసాచి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. జయేశ్‌కు అడ్మినిస్ట్రేషన్‌పై పట్టుండటంతో CM సానుకూలంగా ఉన్నారు. వచ్చే ఏడాదే ఆయనతో పాటు సవ్యసాచి రిటైర్మెంట్ కానుండటం ప్రతికూలంగా మారింది. 2028 వరకు సర్వీస్ ఉన్న వికాస్‌కు ఎక్కువ ఛాన్సుంది. రామకృష్ణారావు పొడిగింపుపైనా ఆలోచిస్తోంది. DGP నియామకంలో CV ఆనంద్ పేరు వినిపిస్తోంది.
News February 20, 2026
పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఇవి పొలాలు, తోటల్లో చేరి మొక్కల ఆకులు, కాయలు, పండ్లను తినడం వల్ల తీవ్ర పంట నష్టం కలగడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, మామిడి, అరటి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, వంగ, దోస, క్యాబేజి, బెండ, మల్బరీ, బంతి తోటల్లో వీటి ముప్పు ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.


