News October 26, 2024
TNGOలతో కలిసి పని పనిచేస్తాం RTC JAC
TGSRTC ఇకనుంచి టీఎన్జీవోతో కలిసి పని చేయనున్నట్లు RTC JAC ప్రకటించింది. టీఎన్జీవో కార్యాలయంలో జరిగిన 2 జేఏసీల ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం సమన్వయంతో సంయుక్తంగా పోరాట కార్యక్రమం రూపొందించుకుంటామని తెలిపారు. JAC వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News November 4, 2024
మరింత అందంగా మన హైదరాబాద్
మన హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ మరింత అందంగా ముస్తాబుచేస్తోంది. బల్దియా పరిధిలోని అన్ని జంక్షన్లను సుందరీకరిస్తున్నారు. ఎల్బీనగర్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్‌తో పాటు ఇతర ఏరియాల్లోని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల వద్ద రంగు రంగుల బొమ్మలు గీస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఈ చిత్రాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.
News November 3, 2024
HYD: చికెన్ ఫ్రైలో పురుగుపై కోర్టులో కేసు
హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న మెహ్ ఫిల్ రెస్టారెంట్లో స్విగ్గి ద్వారా అనిరుద్ అనే వ్యక్తి చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రై, తదితర ఆర్డర్ చేయగా.. చికెన్ ఫ్రైలో పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందించగా, యంత్రాంగం కదిలింది. పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు, అసురక్షిత ఆహార పదార్థాలను గమనించి, టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు.
News November 3, 2024
గ్రేటర్ HYDలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే CHANCE?
2025-26లో దేశ వ్యాప్తంగా జనగణన జరగనుంది. జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాల స్థానాలు పెరగనున్నాయి. ఇదే తరుణంలో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 స్థానాలు, 153కు చేరే అవకాశం ఉండగా.. గ్రేటర్ HYDలో ప్రస్తుతం ఉన్న 24 నియోజకవర్గాలు కాస్త.. 50కి చేరే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.