News September 24, 2025
వేధింపులకు చెక్ పెట్టాలంటే..

ప్రస్తుతకాలంలో చదువులు, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం చాలామంది మహిళలు ఉన్న ఊరు వదిలి, అందరికీ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఆకతాయిల వేధింపులకు గురవుతుంటారు. వీరి కోసం ప్రభుత్వం కొన్ని టోల్‌ఫ్రీ నంబర్లు అందుబాటులోకి తెచ్చింది. గృహ హింస, వరకట్నం బాధితులైతే 181, మహిళల అక్రమరవాణా, లైంగిక వేధింపులపై 1091, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, వేధింపులకు సంబంధించి 1098 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
Similar News
News February 17, 2026
ఈ జిల్లాల్లో అకాల వర్షాలు

TG: ఈ నెల 22, 23, 24 తేదీల్లో పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఈ నెల 22న నార్త్, ఈస్ట్ జిల్లాల్లో (ఆదిలాబాద్, ములుగు, జగిత్యాల, మంచిర్యాల etc), 23, 24 తేదీల్లో HYD, WGL, సిద్దిపేట, ఖమ్మం, కరీంనగర్, సూర్యాపేట, భద్రాచలం జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొన్నారు. కొన్ని చోట్ల వడగళ్ల వర్షం పడొచ్చని తెలిపారు. ఈ నెల 20 నాటికి దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు.
News February 17, 2026
సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

2016 నాటి SC/ST అట్రాసిటీ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. TG హైకోర్టు క్వాష్ చేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. స్పష్టమైన ఆధారాలు లేవని గతంలో HC ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇది రాజకీయ లబ్ధి కోసం దాఖలైన పిటిషన్‌లా ఉందని ధర్మాసనం పేర్కొంది. SC సొసైటీ విధ్వంసం కేసులో తనను కులం పేరుతో రేవంత్ దూషించారని పెద్దిరాజు ఈ కేసు వేశారు.
News February 17, 2026
ఏఐ సదస్సుకు బిల్‌గేట్స్ దూరం

ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్‌కు బిల్‌గేట్స్ దూరంగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎప్‌స్టీన్ బాధితులకు అండగా ఉండటమే ముఖ్యమని వెల్లడించాయి. అమ్మాయిలతో బిల్‌గేట్స్ దిగిన ఫొటోలు ఇటీవల ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో బయటికి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆయన భారత పర్యటనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అలాంటి వ్యక్తిని ఆహ్వానించడం ఏంటని ప్రశ్నలొచ్చాయి. దీంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


