News October 2, 2025
కడుపు నిండాలంటే కోరిక తీర్చాల్సిందే!

యుద్ధం కారణంగా గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా మహిళల కష్టాలు వర్ణనాతీతం. పిల్లల కడుపు నింపడానికి ఒళ్లు అమ్ముకోవాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వారి దుస్థితిని ఆసరాగా చేసుకుని స్వచ్ఛంద సంస్థల వాలంటీర్లు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమ కోరిక తీరిస్తేనే ఆహారం అందిస్తామని చెప్పి మహిళలను లోబర్చుకుంటున్నారు. మానవతా సాయం ముసుగులో అకృత్యాలకు తెరతీస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది.
Similar News
News February 11, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాను కోరిన CM

ఢిల్లీ పర్యటనలో భాగంగా CM చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. APలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కోరారు. పోలవరం రెండో దశకు రూ.32 వేలకోట్లు అవసరమని జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు.
News February 11, 2026
సంజూ శాంసన్‌కు గోల్డెన్ ఛాన్స్!

NZ సిరీస్‌లో ఫామ్ కోల్పోయి T20 WC తొలి మ్యాచ్‌లో ప్లేయింగ్11లో చోటు కోల్పోయిన సంజూకు గోల్డెన్ ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. ఓపెనర్ అభిషేక్ కడుపు నొప్పితో బాధపడుతున్న నేపథ్యంలో ఎల్లుండి నమీబియాతో జరిగే మ్యాచ్‌లో శాంసన్ జట్టులోకి వస్తారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. అందులో రాణిస్తే టీమ్‌లో ప్లేస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సుందని అంటున్నాయి. అటు సిరాజ్ ప్లేస్‌లో బుమ్రా ఎంట్రీ ఇస్తారని భావిస్తున్నాయి.
News February 10, 2026
T20WC: USAపై పాక్ విజయం

అమెరికాతో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ 32 రన్స్ తేడాతో గెలిచింది. 191 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన USA 158/8 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు ప్లేయర్లలో రంజనే 51, షయాన్ 49, మిలింద్ 29 రన్స్ మినహా ఎవరూ రాణించలేదు. పాక్ బౌలర్లలో తారిఖ్ 3, షాదాబ్ 2 వికెట్లు తీశారు. టోర్నీలో పాక్‌కు ఇది రెండో విజయం కాగా USAకు రెండో ఓటమి.


