News October 9, 2025
వేరు శనగలో దిగుబడి పెరగాలంటే!

వేరు శనగ నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.
Similar News
News October 10, 2025
IPS ఆత్మహత్య.. DGPపై కేసు నమోదు

హరియాణాలో సంచలనం సృష్టించిన IPS ఆఫీసర్ పూరన్ కుమార్ <<17954358>>ఆత్మహత్య<<>> కేసులో ఆ రాష్ట్ర డీజీపీ శత్రుజీత్ సింగ్‌పై కేసు నమోదైంది. పూరన్ భార్య, IAS అన్మీత్ కుమార్ ఫిర్యాదుతో డీజీపీతో పాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ అయింది. మంగళవారం పూరన్ కుమార్ తన తుపాకీతో కాల్చుకొని చనిపోయారు. ఉన్నతాధికారుల కుల వివక్ష వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఆరోపించారు.
News October 10, 2025
NTR వైద్య సేవలను ఆపొద్దు: మంత్రి సత్యకుమార్

AP: సీఎంతో మాట్లాడి NTR వైద్య సేవల నెట్‌వర్క్ ఆస్పత్రుల <<17957233>>సమస్యలు<<>> పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. ‘ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2,500కోట్ల బకాయిలున్నాయి. ఇటీవల రూ.250కోట్లు విడుదల చేశాం. రూ.670కోట్ల బిల్లులు అధికారులు అప్లోడ్ చేశారు. మరో రూ.2వేల కోట్లు స్క్రూటినీలో ఉన్నాయి. గత ప్రభుత్వం పెట్టిన బకాయిల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. వైద్య సేవల్ని ఆపొద్దు’ అని కోరారు.
News October 10, 2025
త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లిస్తాం: లోకేశ్

AP: IT, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖపై సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. ‘స్టార్టప్‌ల వృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి. మరో 2 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తేవాలి’ అని అన్నారు. రేపు క్యాబినెట్ భేటీలో ప్రవేశపెట్టనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా చర్చించారు.