News July 4, 2024
WC విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలంటే?

T20WCతో భారత జట్టు ఈరోజు సా.5-7గంటల మధ్య ఓపెన్ బస్సులో పరేడ్‌లో పాల్గొంటుంది. ముంబైలోని నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు ఈ యాత్ర ఉంటుంది. విక్టరీ పరేడ్‌లో పాల్గొనాలనుకునేవారు సా.4.30గంటల్లోపు ఆ ప్రాంతంలో ఉండాలి. స్టేడియంలో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలనుకుంటే సా.6గంటల్లోపే స్టేడియంలోకి వెళ్లి సీట్లలో కూర్చోవాలి. ముంబైలో ఉన్న మీ స్నేహితులు ఎవరైనా పరేడ్‌కు వెళ్తుంటే దీన్ని షేర్ చేయండి.
Similar News
News April 3, 2026
PHOTOS: భూమి ఎంత అందంగా ఉందో చూడండి

‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు అంతరిక్షం నుంచి తీసిన భూమి ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. బ్లూ, బ్రౌన్ రంగుల వెలుగుల్లో అద్భుతంగా ప్రకాశిస్తున్న భూమి ఫొటోలను నాసా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘ఆర్టెమిస్-2’ వ్యోమగాములు చంద్రుని వైపు ప్రయాణిస్తుండగా స్పేస్ క్రాఫ్ట్‌లోని విండో నుంచి ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు పేర్కొంది. నలుగురు ఆస్ట్రోనాట్లతో కూడిన రాకెట్ ఈ నెల 2న నింగిలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
News April 3, 2026
పార్లమెంటు ప్రత్యేక సెషన్ ‘కోడ్’ ఉల్లంఘనే: INC

మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చకు ఈనెల 16-18 తేదీల్లో పార్లమెంటు సెషన్ నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయంపై INC మండిపడింది. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించడమేనని విమర్శించింది. ‘ఈనెల 29న తుది పోలింగ్ ముగిశాక పెట్టాలని విపక్షాలు సూచించాయి. మంత్రి రిజిజుకు ఖర్గే లేఖ రాశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికే సభ పెడుతున్నారు’ అని INC నేత జైరామ్ రమేశ్ దుయ్యబట్టారు.
News April 3, 2026
రాముడిగా తెలుగు హీరోల్లో ఎవరు బాగుంటారు?

ప్రస్తుత తెలుగు హీరోల్లో శ్రీ రాముడి గెటప్‌లో ఎవరు బాగుంటారనే చర్చ ఎప్పటినుంచో జరుగుతోంది. తాజాగా ‘రామాయణ’ టీజర్‌లో రణ్‌బీర్ రాముడిగా కనిపించడం, ‘వారణాసి’లో మహేశ్ బాబు కూడా ఆ పాత్రలో నటిస్తుండటంతో మరోసారి దీనిపై చర్చ మొదలైంది. ఫ్యాన్స్ తమ అభిమాన నటుడిని రాముడిగా చూడాలని కోరుకుంటున్నారు. మరి తెలుగు హీరోల్లో ఎవరు బాగా సెట్ అవుతారు? ఎవరు బాగా నటించగలరని మీరనుకుంటున్నారో కామెంట్ చేయండి.


