News September 13, 2024

TOADY HEADLINES

image

✵సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత
✵TG: బీఆర్ఎస్ హయాంలో పీఏసీ పదవి MIMకి ఎందుకిచ్చారు? : రేవంత్
✵ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీఎం చంద్రబాబు
✵TG: కౌశిక్ రెడ్డి, అరికెపూడి సవాళ్లతో ఉద్రిక్తత.. ఇద్దరిపై కేసు నమోదు
✵సైబరాబాద్ సీపీ ఆఫీస్ ఎదుట ధర్నా.. హరీశ్ రావు అరెస్ట్
✵AP:ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల గడువు పొడిగింపు
✵ఎకరాకు రూ.25 వేల పరిహారమివ్వాలి: YS షర్మిల

Similar News

News October 18, 2025

ఆరోగ్యకరమైన జుట్టుకు చిలగడదుంప

image

చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు రాలడాన్ని ఇది అడ్డుకుంటుంది. చిలగడదుంపలో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్ A, C, B, E, పొటాషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు జుట్టు రాలడం, పల్చబడటాన్ని తగ్గిస్తాయి. దీన్ని తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

News October 18, 2025

పాకిస్థాన్‌ది అనాగరిక చర్య: రషీద్ ఖాన్

image

జనావాసాలపై పాక్ చేసిన వైమానిక దాడిని అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్రంగా ఖండించారు. ‘ఈ అనాగరిక, ఆటవిక చర్యలో మహిళలు, పిల్లలు, దేశానికి ప్రాతినిధ్యం వహించాల్సిన యువ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుంది. ట్రై సిరీస్ నుంచి వైదొలగాలని అఫ్గాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఈ క్లిష్ట సమయాల్లో నా ప్రజల పక్షాన నిలబడతా’ అని ట్వీట్ చేశారు.

News October 18, 2025

యమ దీపం ఎలా పెట్టాలంటే..?

image

ధన త్రయోదశి నాడు వెలిగించే యమ దీపంలో నాలుగు వత్తులు, నాలుగు ముఖాలుగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ‘ఈ దీపం కోసం.. నువ్వుల నూనె/ ఆవ నూనెను ఉపయోగించాలి. దీపాన్ని ఇంటి బయట దక్షిణ దిశలో ఉంచాలి. కుటుంబ సభ్యులందరూ దీర్ఘాయుష్షుతో, కష్టాల నుంచి విముక్తి పొందాలని యమధర్మరాజును ప్రార్థించాలి. ఈ దీపదానం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు నిలిచి, అకాల మరణ భయం తొలగిపోతుంది’ అని అంటున్నారు.