News September 22, 2024

OTTల్లో పొగాకు హెచ్చరికలు తప్పనిసరి!

image

పొగాకు వల్ల కలిగే దుష్పరిణామాలపై హెచ్చరిక ప్రకటన OTTలకు తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈమేరకు సవరించిన ప్రతిపాదనలను కేంద్రం విడుదల చేసింది. సెన్సార్ సర్టిఫికెట్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రసారమయ్యే అన్ని సినిమాలకు ప్రారంభంలో, మధ్యలో కనీసం 30సెకన్ల పొగాకు వ్యతిరేక ప్రకటన ప్రసారం చేయాల్సి ఉంటుంది. సినిమాల్లోనూ పొగాకు ఉత్పత్తులను వాడే సన్నివేశాల సమయంలో హెచ్చరికలు ప్రదర్శించాల్సి ఉంటుంది.

Similar News

News September 22, 2024

చరిత్ర సృష్టించిన భారత్

image

చెస్ ఒలింపియాడ్‌-2024లో భారత్ తన మొట్టమొదటి బంగారు పతకాన్ని గెలుచుకుంది. టోర్నీలో తొలిసారి పసిడి పతకాన్ని గెలిచి చరిత్ర సృష్టించింది. ఓపెన్ సెక్షన్‌లో భారత్‌ మరో రౌండ్‌ మిగిలుండగానే 19 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా ప్లేయర్‌ ఫాబియానో కరువానను దొమ్మరాజు గుకేశ్‌ ఓడించారు. ఈయన నవంబర్‌లో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తలపడనున్నారు. కాగా 2020లో రష్యాతో కలిసి భారత్ సంయుక్త విజేతగా నిలిచింది.

News September 22, 2024

ఏఆర్ డెయిరీలో కేంద్రం తనిఖీలు

image

AP: తిరుమలకు గతంలో ఆవు నెయ్యిని సరఫరా చేసిన ఏఆర్ డెయిరీలో కేంద్ర ఆహార భద్రతా విభాగం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. తమిళనాడులోని దిండుగల్ ప్లాంటులో సుమారు రెండు గంటల పాటు తనిఖీలు చేసి నెయ్యి, వెన్న, పెరుగు శాంపిల్స్ సేకరించారు. కాగా ఈ సంస్థ తిరుమలకు పంపిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, బ్లాక్ లిస్టులో పెట్టామని టీటీడీ ఈవో చెప్పడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

News September 22, 2024

నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ

image

AP: టీటీడీ అధికారులు ఇవాళ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక ఇవ్వనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది.