News August 2, 2024
నేడు అమరావతికి ఐఐటీ నిపుణులు

AP: ఇవాళ రాజధాని అమరావతికి ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ మద్రాస్ నిపుణులు రానున్నారు. రెండు రోజుల పాటు వారు అమరావతి కట్టడాలను పరిశీలించనున్నారు. పునాదుల దశలో అసంపూర్తిగా ఉన్న భవనాల స్థితిగతులను అధ్యయనం చేయనున్నారు. సచివాలయం, హైకోర్టు భవనాలు, ఐఏఎస్, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాల నాణ్యతను అంచనా వేయనున్నారు. పరిశీలన అనంతరం నిపుణుల బృందం రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వనుంది.
Similar News
News December 8, 2025
మద్యం విక్రయాలపై కఠిన నిషేధం: సీపీ సునీల్ దత్

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలోని మండలాల్లో మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశించారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరిగే మూడు విడతల పోలింగ్‌కు ముందు రెండు రోజులు సాయంత్రం 5 గంటల నుంచి, పోలింగ్ ముగిసే వరకు, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు, వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు పూర్తిగా మూసివేయాలని తెలిపారు.
News December 8, 2025
వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ భాగం: గవర్నర్

TG: 2047 వికసిత్ భారత్‌లో తెలంగాణ రైజింగ్ ఓ భాగమని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించారు. ‘లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకెళ్తోంది. అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుంది. ఆవిష్కరణల్లో ముందంజలో ఉంది. 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తుందని నమ్మకం ఉంది. లక్ష్యం దిశగా రేవంత్ సర్కార్ విజన్‌తో పనిచేస్తోంది’ అని చెప్పారు.
News December 8, 2025
చెన్నై టు రష్యా.. నూతన సరకు రవాణా మార్గం

భారత్-రష్యా మధ్య సరకుల రవాణా సమయం రానున్న కాలంలో సగం వరకు తగ్గనుంది. ప్రస్తుతం రష్యాకు నౌకల ద్వారా సరకుల రవాణాకు 40 రోజుల సమయం పడుతోంది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ చెన్నై-వ్లాడివోస్టాక్ మధ్య తూర్పు కారిడార్ ఏర్పాటుపై చర్చించారు. ఇది కార్యరూపం దాల్చితే 5,700 కి.మీ దూరం తగ్గి 24 రోజుల్లోనే రష్యాకు సరకులు చేరతాయి. కాగా ప్రపంచ ఉద్రిక్తల నేపథ్యంలో ఇది సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు.


