News September 23, 2025
నేడు బ్రహ్మచారిణి అలంకారంలో భ్రమరాంబికాదేవి

ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల క్షేత్రంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిన్న శైలపుత్రీ అమ్మవారిగా కొలువుదీరిన భ్రమరాంబికాదేవి నేడు సాయంత్రం బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమిస్తారు. రాత్రి 7 గంటలకు మయూర వాహనంపై గ్రామోత్సవం ఉంటుంది. ఈ రూపంలో దర్శించి, పూజిస్తే దివ్య జ్ఞానం వస్తుందని, మరణ భయం ఉండదని పండితులు చెబుతారు. ఈ అలంకారంలో అమ్మవారు కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశంతో కనిపిస్తారు.
Similar News
News September 23, 2025
ప్రెగ్నెన్సీ ప్రకటించిన కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ త్వరలో తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని కత్రినాతో పాటు ఆమె భర్త విక్కీ కౌశల్ ప్రకటించారు. ‘మా జీవితాల్లో బెస్ట్ ఛాప్టర్‌ను ఆరంభించబోతున్నాం’ అని పేర్కొంటూ ఇన్‌స్టాలో బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. స్టార్ కపుల్‌కు ఇండస్ట్రీ, ఫ్యాన్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2021లో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
News September 23, 2025
555 టీఎంసీల కృష్ణా జలాలు కేటాయించాలి: ఉత్తమ్

TG: కృష్ణా జలాల వివాదంపై ఢిల్లీలోని ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో అత్యధిక భూభాగంలో నది ప్రవహిస్తున్నందున 811 టీఎంసీల్లో 555 టీఎంసీలు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి చెందాల్సిన నీటి వాటాలో ఒక్క చుక్క కూడా వదులుకోబోమని తేల్చి చెప్పారు. ఈ సమావేశానికి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు.
News September 23, 2025
వారికీ తల్లికి వందనం నిధులు విడుదల చేస్తాం: మంత్రి లోకేశ్

AP: తల్లికి వందనం కింద 66,57,508 మంది విద్యార్థులకు రూ.15వేల చొప్పున సాయం అందించినట్లు మంత్రి లోకేశ్ మండలిలో తెలిపారు. ఇంకా అర్హులుంటే తప్పకుండా వర్తింపజేస్తామన్నారు. ఒకటో తరగతి విద్యార్థులకు అపార్ ఐడీ మంజూరు తర్వాత, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరినవారికి వెరిఫికేషన్ అనంతరం జమ చేస్తామని చెప్పారు. ఆశావర్కర్లు, అంగన్‌వాడీలకు కూడా పథకం వర్తింపు విషయాన్ని క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.