News August 3, 2024
నేడు సీఎం చంద్రబాబు ప్రజాదర్బార్

AP: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు ఇవాళ ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఉ.11 గంటల నుంచి ప్రజలు, కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరిస్తారు. రోజుకొక ప్రజాప్రతినిధి, టీడీపీ నేత కలిసి ప్రజాదర్బార్లో కొన్ని వారాలుగా వినతి పత్రాలు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. 50 రోజుల్లోనే 10 వేల అర్జీలు వచ్చాయని, వాటిని పరిష్కరిస్తామని TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
Similar News
News November 25, 2025
ఉత్తర తెలంగాణకు రూ.10,000కోట్ల NH ప్రాజెక్టులు

తెలంగాణలో రూ.10,034 కోట్ల అంచనా వ్యయంతో 4 కీలక జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. NH-167(MBNR-గుడెబల్లూర్ -80kms) ₹2,662 కోట్లు, NH-63 (అర్మూర్-జగిత్యాల, 71kms) ₹2,338 కోట్లు, NH-63 (జగిత్యాల-మంచిర్యాల, 68kms) ₹2,550 కోట్లు, NH-563 (JGL-KNR, 59kms)కి ₹2,484 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కొత్త NHలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రవాణా కనెక్టివిటీని గణనీయంగా మెరుగుపరుస్తాయి.
News November 25, 2025
కుల్దీప్ యాదవ్ @134

ఇదేంటి అనుకుంటున్నారా? దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో కుల్దీప్ యాదవ్ ఎదుర్కొన్న బంతుల సంఖ్య. 11 మందిలో 100 బంతులకుపైగా ఎదుర్కొన్నది ఆయనే కావడం గమనార్హం. 134 బంతులను ఎదుర్కొన్న కుల్దీప్ 19 పరుగులు చేశారు. జైస్వాల్ 58(97), సుందర్ 42(92) చేశారు. కాగా రెండో ఇన్నింగ్సులోనైనా వీలైనంత ఎక్కువ టైమ్ క్రీజులో ఉంటేనే భారత్ ఓటమి నుంచి తప్పించుకోవచ్చని ఫ్యాన్స్ అంటున్నారు.
News November 25, 2025
నవంబర్ 25: చరిత్రలో ఈరోజు

1926: 21వ సీజేఐ రంగనాథ్ మిశ్రా జననం
1964: వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మరణం
1968: సినీ దర్శకుడు ముప్పలనేని శివ జననం
1972: సినీ నటి సుకన్య జననం
2010: ఒగ్గు కథ కళాకారుడు మిద్దె రాములు మరణం(ఫొటోలో)
2016: క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో మరణం
* అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినం


