News July 22, 2024
నేడు గంభీర్ చేతికి కోచ్ పగ్గాలు

టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి ముంబైలో మీడియాతో మాట్లాడనున్నారు. కాగా ఈనెల 27 నుంచి శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్‌తో గౌతీ కోచింగ్ ప్రస్థానం ప్రారంభం కానుంది. మరోవైపు భారత్‌కు బౌలింగ్ కోచ్ లేకపోవడంతో ఈ సిరీస్‌కు తాత్కాలికంగా సాయిరాజ్ బహుతులెకు బీసీసీఐ ఆ బాధ్యతలు అప్పగించింది.
Similar News
News October 22, 2025
గాయిటర్ చికిత్స

థైరాయిడ్ గ్రంథి అయోడిన్‌ను గ్రహించి దాన్ని థైరాయిడ్ హార్మోన్లుగా మారుస్తుంది. అయోడిన్ లోపిస్తే గాయిటర్ జబ్బు వస్తుంది. థైరాయిడ్ సమస్య నిర్ధారణ కోసం చేసే పరీక్షల ఫలితాల ఆధారంగా గాయిటర్ చికిత్సకు ఎండోక్రైనాలజిస్ట్ ఆధ్వర్యంలో తగిన చికిత్స చేస్తారు. థైరాయిడ్ వ్యవస్థను సరిచేయడం ద్వారా కొంతమందిలో గాయిటర్ తగ్గుముఖం పడుతుంది. సాధారణంగా దీన్ని ఎలాంటి శస్త్రచికిత్స అవసరం లేకుండానే నయం చేయవచ్చు.
News October 22, 2025
ఇతిహాసాలు క్విజ్ – 43 సమాధానాలు

1. జనకుని తమ్ముడి పేరు కుశధ్వజుడు.
2. కుంతీ కుమారుల్లో పెద్దవాడు ‘కర్ణుడు’.
3. ఊర్ధ్వ లోకాలలో మొదటి లోకం భూలోకం.
4. విష్ణువు చేతిలో ఉండే చక్రం పేరు ‘సుదర్శన చక్రం’.
5. దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు వాటికి జీవం పోసే ఆచారం/వేడుకను ‘ప్రాణ ప్రతిష్ఠ’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 22, 2025
ఎలాంటి ప్రీమియం లేకుండా రూ.7లక్షల బీమా!

కుటుంబ పెద్ద చనిపోతే అతని భార్యాపిల్లలు ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బందిపడాల్సిందే. అందుకే ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావొద్దని EPFO తన సభ్యులకు EDLI కింద ఆర్థిక భరోసా కల్పిస్తుంది. పీఎఫ్ ఖాతాదారుడు సర్వీస్‌లో ఉండగా మరణిస్తే కుటుంబానికి గరిష్ఠంగా రూ.7లక్షల వరకు ఉచిత బీమా లభిస్తుంది. దీనికి ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేదు. PF ఖాతాలో నామినీ వివరాలు అప్డేట్ చేసుకోవడం మరిచిపోకండి. SHARE IT