News June 20, 2024
TODAY HEAD LINES
✒ బిహార్‌లో నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించిన PM
✒ పంటల కనీస మద్దతు ధరలు పెంచిన కేంద్రం
✒ AP: భారీగా ఐఏఎస్‌ల బదిలీ
✒ AP: వైసీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు: షర్మిల
✒ AP: పవన్ చేతికి పవర్.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు
✒ యూజీసీ NET-2024 రద్దు
✒ సౌతాఫ్రికాపై భారత మహిళల జట్టు విజయం
✒ కెప్టెన్సీకి కేన్ విలియమ్సన్ గుడ్ బై
Similar News
News January 18, 2025
భారతీయుల ఆయుర్దాయం ఎంతంటే?
ప్రపంచంలోని వివిధ దేశాలను బట్టి ప్రజల సగటు జీవిత కాలం మారుతుంటుంది. హాంకాంగ్‌లో ఉండే ప్రజలు సగటున ఏకంగా 85 ఏళ్లు జీవిస్తారని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ వెల్లడించింది. అత్యల్పంగా నైజీరియాలో 53 ఏళ్లు మాత్రమే జీవిస్తారని తెలిపింది. ఈ జాబితాలో మకావో(85), జపాన్(84), సౌత్ కొరియా(84), స్విట్జర్లాండ్(84), సింగపూర్(83), నార్వే(83), AUS(83), స్పెయిన్(83), ఇండియా(67), పాకిస్థాన్(66) ఉన్నాయి.
News January 18, 2025
ఆహారాన్ని పదే పదే వేడిచేస్తున్నారా?
అన్నంతో పాటు ఇతర ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘గదిలో రైస్‌ను ఎక్కువ సేపు ఉంచడం వల్ల బ్యాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది హానికరమైన టాక్సిన్స్ విడుదల చేస్తుంది. దీంతో పోషకాలు కోల్పోవడం, జీర్ణ సమస్యలు & ఫుడ్ పాయిజనింగ్ జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే రైస్ వండిన గంటలోనే ఫ్రిజ్‌లో ఉంచి తినేముందు వేడి చేయాలి’ అని సూచిస్తున్నారు.
News January 18, 2025
కొలికపూడిపై అధిష్ఠానం సీరియస్.. చర్యలకు సిద్ధం!
AP: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలకు టీడీపీ అధిష్ఠానం సిద్ధమైంది. ఇటీవల ఓ ఎస్టీ మహిళపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. సీఎం చంద్రబాబు కూడా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం క్రమశిక్షణా కమిటీ ముందు హాజరవ్వాలని కొలికపూడిని ఆదేశించింది. గతంలోనూ ఆయన తీరు వివాదాస్పదమైన విషయం తెలిసిందే.