News August 25, 2024

TODAY HEADLINES

image

* HYDలో నాగార్జున N-కన్వెన్షన్ కూల్చివేత.. హైకోర్టు స్టే
* టీజీఎస్‌ఆర్టీసీలో త్వరలో 3,035 ఉద్యోగాల భర్తీ: మంత్రి పొన్నం
* మహిళా కమిషన్ ఎదుట కేటీఆర్ హాజరు
* DEC 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు: మంత్రి నారాయణ
* ఈనెల 30న APలో వనమహోత్సవం: పవన్ కళ్యాణ్
* రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ శిఖర్ ధవన్
* కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్

Similar News

News January 29, 2025

ఘోర విషాదం.. 20 మంది మృతి?

image

మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించినట్లు తెలుస్తోంది. 100 మంది భక్తులు గాయపడ్డారు. వారికి మేళా సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శిబిరాల్లో ఉన్న క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. ఘటనపై మోదీ, షా ఆరా తీశారు.

News January 29, 2025

మహాకుంభ్ రైళ్ల రద్దుపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ

image

మహాకుంభ్ స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే తాత్కాలికంగా నిలిపేసిందన్న వార్తలపై రైల్వే మినిస్ట్రీ క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికైతే అలాంటి ప్లానేమీ లేదని తెలిపింది. మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని వేర్వేరు స్టేషన్ల నుంచి ఈ ఒక్కరోజే 360 రైళ్లను నడిపేందుకు ప్లాన్ చేస్తున్నామని వెల్లడించింది. మౌని అమావాస్య కావడంతో నేడు త్రివేణీ సంగమ స్థలి, వివిధ ఘాట్లు భక్తకోటితో నిండిపోవడం తెలిసిందే.

News January 29, 2025

ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు?

image

AP: కూటమి ప్రభుత్వం త్వరలోనే మహిళలకు శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ ఓ నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 6న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత పథకం ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.