News August 26, 2024
TODAY HEADLINES
* భగవద్గీత స్ఫూర్తితోనే అక్రమ నిర్మాణాల కూల్చివేత: CM రేవంత్
* కర్ణాటక వాల్మీకి స్కామ్లో టీకాంగ్రెస్ నేతలు: KTR
* N-కన్వెన్షన్పై వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ: నాగార్జున
* మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు కన్నుమూత
* పనితీరు బాగున్న వారికే టీడీపీలో ప్రాధాన్యం: చంద్రబాబు
* విజయవాడలో ‘ఎంపాక్స్’ అంటూ ప్రచారం.. ఖండించిన DMHO
* మహిళలపై నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించం: ప్రధాని మోదీ
Similar News
News January 15, 2025
కర్ణాటక సీఎం: మార్చి తరువాత మార్పు?
CM సిద్ద రామయ్య త్వరలో తప్పుకుంటారని తెలుస్తోంది. మార్చిలో బడ్జెట్ అనంతరం DK శివకుమార్ CM పగ్గాలు చేపడతారని ప్రచారం జరుగుతోంది. పవర్ షేరింగ్ ఫార్ములా ప్రకారం బాధ్యతల బదిలీ జరగనుందని తెలిసింది. అందుకే సిద్ద రామయ్య ఎంపిక చేసిన మంత్రులు, MLAలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారని సమాచారం. ఈ విషయమై పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడవద్దని అధిష్ఠానం ఇప్పటికే ఆదేశించింది.
News January 15, 2025
ఆతిశీ జింకలా పరిగెడుతున్నారు.. మళ్లీ నోరు జారిన బిధూరీ
ఢిల్లీ CM ఆతిశీ తన తండ్రినే మార్చేశారంటూ <<15102620>>వివాదాస్పద వ్యాఖ్యలు<<>> చేసిన రమేశ్ బిధూరీ మరోసారి నోరు జారారు. ఆమె ఓట్ల కోసం ఢిల్లీ రోడ్లపై జింకలా పరిగెడుతున్నారని కామెంట్ చేశారు. నాలుగేళ్లలో ఆమె ఎప్పుడూ నగర సమస్యలను పట్టించుకోలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే నియోజకవర్గ రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా మారుస్తానని రమేశ్ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.
News January 15, 2025
Stock Market: ఈ రోజు కూడా గ్రీన్లోనే
అధిక వెయిటేజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా గ్రీన్లోనే ముగిశాయి. Sensex 224 పాయింట్ల లాభంతో 76,724 వద్ద Nifty 37 PTS ఎగసి 23,213 వద్ద స్థిరపడ్డాయి. IT, రియల్టీ షేర్లు రాణించాయి. NTPC, TRENT, Power Grid, Kotak Bank, Maruti టాప్ గెయినర్స్. M&M, Axis Bank, Bajaj Finserv టాప్ లూజర్స్. Sensex 76,700 పరిధిలో, Nifty 23,300 వద్ద రెసిస్టెన్స్ ఉంది.