News August 27, 2024
TODAY HEADLINES

* TGలో త్వరలో 35వేల ఉద్యోగాలు: CM రేవంత్
* రేపు కవిత బెయిల్‌పై తీర్పు.. ఢిల్లీకి BRS ఎమ్మెల్యేలు
* TGలో సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున అందజేత
* సెప్టెంబర్ 1 నుంచి ఏపీలో రెవెన్యూ సదస్సులు: మంత్రి రాంప్రసాద్
* కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
* వైసీపీకి ఏలూరు మేయర్ రాజీనామా
* అక్టోబర్ 3 నుంచి యూఏఈలో మహిళల టీ20 వరల్డ్‌కప్
* రైతులపై కంగనా కామెంట్స్.. తప్పుపట్టిన బీజేపీ అధిష్ఠానం
Similar News
News January 14, 2026
సంక్రాంతికి ముగ్గులు ఎందుకు వేయాలి?

సంక్రాంతికి వేసే ‘రంగవల్లి’ అంటే రంగుల వరుస అని అర్థం. ఇంటి ముంగిట ముగ్గు వేయడం లక్ష్మీదేవికి ఆహ్వానం పలకడమే కాదు, బియ్యప్పిండితో వేయడం వల్ల మూగజీవాలకు ఆహారం కూడా లభిస్తుంది. ముగ్గుల్లోని జ్యామితీయ ఆకృతులు చూసేవారి మనసుకు ప్రశాంతతను ఇస్తాయని శాస్త్రీయంగా నిరూపితమైంది. వంగి ముగ్గులు వేయడం మహిళలకు మంచి వ్యాయామం. ముగ్గుల్లో వాడే రంగులు సంపదకు, బలానికి సంకేతాలుగా నిలుస్తూ, ఇంటికి శుభాలు చేకూరుస్తాయి.
News January 14, 2026
రూ.15,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీపై ఏకంగా రూ.15,000 పెరిగి రూ.3,07,000కు చేరింది. బంగారం ధరలు సైతం గణనీయంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,090 ఎగబాకి రూ.1,43,620కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,000 పెరిగి రూ.1,31,650గా ఉంది. 3 రోజుల్లో కేజీ వెండి ధర రూ.32,000 పెరగడం గమనార్హం.
News January 14, 2026
దారుణం.. విష ప్రయోగంతో 600 కుక్కలు మృతి

TG: కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వీధికుక్కలపై విషప్రయోగం జరగడంతో దాదాపు 500-600 శునకాలు మృతిచెందాయి. మాచారెడ్డి(M) ఫరీద్‌పేట్, భవానీపేట, వాడి, పల్వంచలో నూతనంగా ఎంపికైన సర్పంచ్‌లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనపై ‘గౌతమ్ స్ట్రే యానిమల్స్ ఫౌండేషన్’ ప్రతినిధులు చేసిన ఫిర్యాదుతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.


