News September 1, 2024
TODAY HEADLINES

✒ స్త్రీలపై నేరాలతో సమాజంలో ఆందోళన: PM
✒ SEP 4 నుంచి JKలో రాహుల్ ప్రచారం!
✒ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం
✒ APలో 8 మంది దుర్మరణం.. రూ.5లక్షల పరిహారం
✒ AP: రేపటి నుంచి రేషన్‌షాపుల్లో పంచదార: ప్రభుత్వం
✒ గుడ్లవల్లేరు ఘటనపై హీరోయిన్ పూనమ్ ఎమోషనల్
✒ TG: హుస్సేన్‌సాగర్ చుట్టూ స్కైవాక్ వే: CM
✒ విద్యాశాఖకు మంత్రిని నియమించాలి: KTR
✒ పారాలింపిక్స్‌లో షూటర్ రుబీనాకు కాంస్యం
Similar News
News November 27, 2025
బ్యాంకర్లు రుణ లక్ష్యసాధనలో పురోగతి సాధించాలి: ASF కలెక్టర్

బ్యాంకర్లు 2025-26 వార్షిక సంవత్సర రుణ లక్ష్య సాధనలో పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ASF కలెక్టరేట్లో వార్షిక సంవత్సరం 2వ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జోషి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీఓ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్లతో కలిసి బ్యాంక్ లింకేజీ రుణాలపై సమీక్షించారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ అబద్ధాలు: నాదెండ్ల

AP: రైతులకు నష్టం లేకుండా ధాన్యం కొంటున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 24 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని చెప్పారు. అయినా YCP నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ₹1,674 కోట్లు బకాయిలు పెట్టి పారిపోయిన వాళ్లా రైతుల పక్షాన మాట్లాడేదని మండిపడ్డారు. 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దళారులను నమ్మి రైతులు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని కోరారు.
News November 27, 2025
పాక్ న్యూక్లియర్ కంట్రోల్స్ ఆసిమ్ మునీర్ చేతికి!

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆ దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా బాధ్యతలు చేపట్టారు. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌కు అతను అధిపతిగా ఉంటారు. ఆ దేశ ప్రధానికి సరిసమానమైన పవర్స్ మాత్రమే కాదు లీగల్ ప్రొటెక్షన్ కూడా ఆసిమ్ మునీర్‌కు ఉంటుందని చెబుతున్నారు. అతనికి కేసుల నుంచి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీతో పాటు న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్స్ కూడా అతని చేతికే ఇస్తారని తెలుస్తోంది.


