News September 2, 2024
TODAY HEADLINES

✒ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. 20 మందికి పైగా మృతి
✒ విజయవాడ మీదుగా వెళ్లే 132 రైళ్లు రద్దు
✒ రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
✒ HYD-VJA జాతీయరహదారిపై రాకపోకలు బంద్
✒ వరద బాధితులకు 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు: CM చంద్రబాబు
✒ అధికారులు సెలవులు పెట్టొద్దు: సీఎం రేవంత్
✒ తెలుగు సీఎంలకు మోదీ ఫోన్.. సాయం అందిస్తామని హామీ
Similar News
News December 1, 2025
స్టీల్ ప్లాంట్ ఘటనపై విచారణకు ఏఐటీయూసీ డిమాండ్

విశాఖ స్టీల్ ప్లాంట్ కన్వేయర్ బెల్ట్ ఘటనపై సీఎండీని విధుల నుంచి దూరంగా ఉంచి, నిపుణులతో జాయింట్ విచారణ జరిపించాలని ఏఐటీయూసీ నేతలు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. యాజమాన్యం లోపం వల్లే బెల్టు తెగిందని, ఉద్యోగులపై నిందలు వేయడం తగదని జిల్లా కార్యదర్శి జి.ఎస్.జె.అచ్యుత రావు మండిపడ్డారు. తప్పుడు మరమ్మతుల వల్లే ప్రమాదం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.
News December 1, 2025
WhatsApp: కొత్త నిర్ణయంతో తిప్పలు తప్పవు!

కేంద్రం తెస్తున్న <<18424391>>‘సిమ్ బైండింగ్’<<>> రూల్ కొందరు వాట్సాప్ యూజర్లపై ప్రభావం చూపనుంది. ఏ నంబర్‌తో యాప్ వాడితే సిమ్ ఆ మొబైల్లో ఆన్‌లో ఉండాలనే రూల్‌తో ఫారిన్ ట్రిప్స్ వెళ్లే వారికి, సిమ్ లేని వారికి ఇబ్బందే. ప్రస్తుతం ఆఫీస్ నంబర్‌తో లింకైన అకౌంట్లు మల్టిపుల్ డివైజ్‌లలో లాగిన్‌లో ఉంటాయి. కానీ ప్రతి 6గం.కు వెబ్ వర్షన్స్ ఆటో- లాగౌట్ నిర్ణయంతో రి-లాగిన్, చాట్స్ లోడింగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్.
News December 1, 2025
ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: CM

TG: ఫ్యూచర్ సిటీ, మెట్రోరైల్ విస్తరణ, RRR, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని CM రేవంత్ హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. అత్యధిక వడ్డీతో ఇచ్చిన లోన్లను రీకన్స్ట్రక్షన్ చేయాలన్నారు. మరో 10L ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై హడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్ అంశాలపైనా వారు చర్చించారు.


