News September 7, 2024
TODAY HEADLINES

* TPCC అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్
* విద్యా కమిషన్ ఛైర్మన్గా ఆకునూరి మురళి
* కాంగ్రెస్లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగట్
* శ్రీశైలం గేట్లు మరోసారి ఎత్తివేత
* రాజస్థాన్ హెడ్ కోచ్గా ద్రవిడ్
* UP: హాథ్రస్ రోడ్డు ప్రమాదంలో 12 మంది మృతి
* ఆర్టికల్-370 ముగిసిన అధ్యాయం: అమిత్ షా
* సీఎం రేవంత్తో కేంద్ర మంత్రి శివరాజ్, బండి భేటీ
* కేంద్రం నుంచి సాయం అందలేదు: CBN
Similar News
News October 21, 2025
భార్యకు దూరంగా సెహ్వాగ్!

మాజీ క్రికెటర్ సెహ్వాగ్ చేసిన దీపావళి పోస్టులో భార్య కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. తల్లి, పిల్లలతో ఉన్న ఫొటోనే వీరూ షేర్ చేశారు. ఆయన భార్య ఆర్తి సైతం పిల్లలతో దిగిన ఫొటోనే పంచుకున్నారు. వీరిద్దరూ చాలా కాలంగా దూరంగా ఉంటున్నారని, సోషల్ మీడియాలో అన్ఫాలో చేసుకున్నారని నేషనల్ మీడియా తెలిపింది. దీంతో విడాకుల రూమర్స్ పెరిగాయి. సెహ్వాగ్ చివరిసారిగా 2023 ఆగస్టులో భార్యతో ఉన్న ఫొటోను షేర్ చేశారు.
News October 21, 2025
23న జాబ్ మేళా

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అనకాపల్లిలోని కోటవురట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈ నెల 23న జాబ్ మేళా జరగనుంది. టెన్త్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీలో పాసైన 18-35 ఏళ్ల యువకులు అర్హులు. 18 కంపెనీలలో ఉద్యోగావకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో రావాలన్నారు. ముందుగా https://naipunyam.ap.gov.in/లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News October 21, 2025
తెలంగాణలో తగ్గిన పప్పు దినుసుల సాగు

TG: రాష్ట్రంలో ఈ ఏడాది పప్పు దినుసుల సాగు విస్తీర్ణం తగ్గింది. గత ఏడాది 8,25,236 ఎకరాల్లో పప్పు దినుసులను సాగు చేయగా.. ఈ ఏడాది 5,83,736 ఎకరాలకే పరిమితమైంది. వర్షాభావ పరిస్థితులు, ధరల్లో హెచ్చుతగ్గులు, మార్కెటింగ్ సమస్యలు, పంట రవాణా వ్యయం పెరుగుదల, నిల్వ వసతులలేమి కారణంగా ఈ పంటల సాగు విస్తీర్ణం తగ్గినట్లు తెలుస్తోంది. పప్పు దినుసుల్లో కందులు, పెసలు, మినుములను రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు.