News September 10, 2024
TODAY HEADLINES

TG: స్వయం సహాయక మహిళలకు ఏటా 2 చీరలు: CM రేవంత్
వరద బాధితులకు రూ.16500: మంత్రి పొంగులేటి
ఫిరాయింపు MLAల అనర్హతను 4 వారాల్లో తేల్చాలి: హైకోర్టు
పీఏసీ ఛైర్మన్గా అరికపూడి గాంధీ.. KTR, హరీశ్ ఫైర్
AP: ప్రకాశం బ్యారేజీ కూల్చేందుకు జగన్ ప్లాన్: CBN
వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన
వరద ప్రాంతాల్లో విద్యుత్ పునురద్ధరణ: మంత్రి గొట్టిపాటి
క్యాన్సర్ మందులు, నమ్కీమ్పై GST తగ్గింపు
Similar News
News November 24, 2025
వంటింటి చిట్కాలు

* కేక్ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ కలిపితే కేక్ ఎక్కువకాలం తాజాగా ఉంటుంది.
* పూరీలు మృదువుగా రావాలంటే పిండిని పాలతో కలపాలి.
* కూరల్లో గ్రేవీ చిక్కగా రావాలంటే అందులో కొంచెం కొబ్బరి పాలు లేదా పెరుగు కలపాలి.
* దుంపలు ఉడికించిన నీటితో వెండి పట్టీలు శుభ్రం చేస్తే తళతలా మెరుస్తాయి.
* కాలీఫ్లవర్ కూరలో టేబుల్ స్పూన్ పాలు కలిపితే కూర రుచిగా ఉంటుంది.
News November 24, 2025
6GHz స్పెక్ట్రమ్ వివాదం.. టెలికం vs టెక్ దిగ్గజాలు

6GHz బ్యాండ్ కేటాయింపుపై రిలయన్స్ జియో, VI, ఎయిర్టెల్కి వ్యతిరేకంగా అమెరికన్ టెక్ దిగ్గజాలు ఏకం అయ్యాయి. మొత్తం 1200 MHzను మొబైల్ సేవల కోసం వేలానికి పెట్టాలని జియో కోరగా Apple, Amazon, Meta, Cisco, HP, Intel సంస్థలు ఈ బ్యాండ్ మొబైల్ సేవలకు సాంకేతికంగా సిద్ధంగా లేదని పేర్కొన్నాయి. పూర్తిగా వైఫై కోసం మాత్రమే ఉంచాలని TRAIకి సూచించాయి.
News November 24, 2025
‘భూ భారతి’లో భూముల మార్కెట్ విలువ!

TG: ‘భూ భారతి’ వెబ్సైట్లో భూముల మార్కెట్ విలువను తెలుసుకునేలా ప్రభుత్వం ఆప్షన్ తీసుకొచ్చింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ కోసం అధికారిక వెబ్సైట్లో తెలుగు, ఇంగ్లిష్లో ఈ సదుపాయాన్ని అందిస్తోంది. సర్వే నంబర్ ఉన్న ప్రతి ల్యాండ్ మార్కెట్ విలువ ఇందులో ఉంటుంది. ధరణి పోర్టల్లోని లోపాలను సరిదిద్దేందుకు ‘భూ భారతి’ని తీసుకొచ్చినట్లు గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.


