News September 30, 2024
TODAY HEADLINES

✒ స్వచ్ఛ భారత్ గాంధీకి సముచిత నివాళి: మోదీ
✒ మోదీని దించేవరకు నేను చావను: ఖర్గే
✒ నేపాల్ వరదల్లో 148 మంది మృతి..
✒ APకి 30 ESI ఆస్పత్రులు: పెమ్మసాని
✒ విశాఖలో షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్: లులు ఛైర్మన్
✒ దీపావళికి ఫ్రీ సిలిండర్లు.. సన్నాహాలు ప్రారంభం
✒ త్వరలో 3వేల TGSRTC ఉద్యోగాల భర్తీ: పొన్నం
✒ రేవంత్‌ది రాతి గుండె: హరీశ్ రావు
✒ రాజకీయాలు కాదు.. నటనే నా తొలి ఆప్షన్: ఎన్టీఆర్
Similar News
News November 20, 2025
ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరు: డీకే శివకుమార్

KPCC చీఫ్ పదవిలో శాశ్వతంగా ఉండలేనని కర్ణాటక డిప్యూటీ CM డీకే శివకుమార్ అన్నారు. ఇప్పటికే ఐదున్నరేళ్లు అయిందని, ఇతరులకు అవకాశం ఇవ్వాలని చెప్పారు. ‘డిప్యూటీ CM అయినప్పుడే PCC చీఫ్ పదవికి రాజీనామా చేద్దామని అనుకున్నా. కానీ కొనసాగమని రాహుల్, ఖర్గే చెప్పారు. నా డ్యూటీ నేను చేశా’ అని తెలిపారు. ఇక్కడ ఎవ్వరూ శాశ్వతంగా ఉండలేరని తెలిపారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
News November 20, 2025
పోలి పాడ్యమి రోజున 30 వత్తులు ఎందుకు?

కార్తీక మాసంలోని 30 రోజులకు ప్రతీకగా పోలి పాడ్యమి రోజున 30 వత్తులు వెలిగిస్తారు. కార్తీక మాసంలో దీపారాధన చేయలేని వారు, ఈ ఒక్క రోజు 30 వత్తులు వెలిగిస్తే, అన్ని రోజుల పుణ్యం లభిస్తుందని నమ్మకం. కొందరు 31 వత్తుల దీపాన్ని కూడా పెడతారు. మరికొందరు గంగాదేవిని ఆరాధిస్తూ 2, గణపతి కోసం 2 పెడతారు. అదనంగా 4 వత్తుల దీపం పెట్టేవారు కూడా ఉంటారు. ఈ నియమం ప్రకారం.. 30-35 ఎన్ని వత్తుల దీపమైనా వెలిగించవచ్చు.
News November 20, 2025
ఢిల్లీ బ్లాస్ట్: అల్ ఫలాహ్‌లో 10 మంది మిస్సింగ్!

ఢిల్లీ పేలుడు మూలాలు అల్ ఫలాహ్ యూనివర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత వర్సిటీకి చెందిన 10 మంది కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఇందులో ముగ్గురు కశ్మీరీలు కూడా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. వాళ్లందరి ఫోన్లు స్విచ్చాఫ్‌లో ఉన్నట్లు చెప్పాయి. ఆ 10 మంది టెర్రర్ డాక్టర్ మాడ్యూల్‌కు చెందిన వారు కావచ్చని అనుమానిస్తున్నాయి. బ్లాస్ట్ వెనుక జైషే మహ్మద్ ఉండొచ్చని వెల్లడించాయి.


