News October 3, 2024

TODAY HEADLINES

image

* నాగ చైతన్య- సమంత విడిపోవడానికి కారణం KTR: మంత్రి కొండా సురేఖ
* నా విడాకుల వెనుక రాజకీయ కుట్ర లేదు: సమంత
* మంత్రి సురేఖ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి: నాగార్జున, చైతూ
* 24 గంటల్లో సురేఖ క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్
* AP: నేటి నుంచి చెత్త పన్ను రద్దు: చంద్రబాబు
* AP: పార్టీలో కష్టించేవారికే అండగా ఉంటా: జగన్
* రూ.83వేల కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
* హైడ్రాకు హై పవర్స్.. గవర్నర్ ఆమోదం

Similar News

News January 2, 2026

కుడి ఎడమైతే.. పొరపాటు ఉందోయ్!

image

కేరళలో నిన్న BJP పేపర్ ‘జన్మభూమి’లో IUML పేపర్ ‘చంద్రిక’ కంటెంట్ వచ్చింది. ఉదయమే జన్మభూమి చదువుతూ, మధ్యలో BJPని తిట్టే కంటెంట్ చూసి కమల నేతలు ఆశ్చర్యపోయారు. ఇరు పేపర్ల కన్నూర్-కాసర్‌గోడ్ ఎడిషన్ ఒకే ప్రెస్‌లో ప్రింట్ అవుతుంది. అక్కడ పొరపాటున అవతలి పార్టీ కంటెంట్ ప్రింట్ అయిందని తర్వాత తెలిసింది. కాగా BJP-ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ బ్యాక్ డోర్ దోస్తీని ఈ ప్రెస్ నిరూపించిందని CPIM విమర్శించింది.

News January 2, 2026

జల జగడంపై కమిటీ.. కేంద్రం నిర్ణయం

image

తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలసంఘం ఛైర్మన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల నుంచి నలుగురు చొప్పున కమిటీలో సభ్యులు ఉండనున్నారు. అలాగే కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు, NWDA, CWC సీఈలు కూడా సభ్యులుగా వ్యవహరిస్తారు.

News January 2, 2026

BRS నిర్ణయంతో సభకు కేసీఆర్ రానట్లే

image

TG: BRS చీఫ్ KCR శాసనసభకు హాజరుకారని తేలిపోయింది. పాలమూరు ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన KCR తొలిరోజు సభలో 3 ని.లు మాత్రమే ఉన్నారు. ఇవాళ రెండో రోజు సమావేశానికీ హాజరు కాలేదు. మరోవైపు ప్రస్తుత సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు BRS కూడా ప్రకటించడంతో ఇక రారనేది స్పష్టమైంది. కాగా కేసీఆర్ సభకు వస్తారని భావించి కాంగ్రెస్ సిద్ధమైంది. ఆయన సభకు రాకపోవడాన్ని CM రేవంత్ తప్పుబట్టారు.