News October 9, 2024

TODAY HEADLINES

image

☛ హరియాణాలో బీజేపీ, J&Kలో కాంగ్రెస్ కూటమి విజయం
☛ ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్
☛ డిసెంబర్ నుంచి అమరావతి పనులు: సీఎం చంద్రబాబు
☛ రూ.50కి టమాటా, రూ.40కి ఉల్లి విక్రయిస్తాం: ఏపీ ప్రభుత్వం
☛ సురేఖ వ్యాఖ్యల వల్ల మా పరువు పోయింది: కోర్టులో నాగార్జున
☛ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్: భట్టి

Similar News

News January 12, 2026

అనిల్ రావిపూడి రికార్డ్.. రాజమౌళి తర్వాత

image

డైరెక్టర్ అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం <<18832382>>పాజిటివ్<<>> టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా నిలిచారు. ‘పటాస్(2015)’ నుంచి ఇవాళ రిలీజైన ‘MSVPG’ వరకు మొత్తం 9 సినిమాల్లోనూ హిట్ కొట్టిన దర్శకుడిగా పేరొందారు. నాగార్జునతోనూ మూవీ చేస్తే నలుగురు సీనియర్ హీరోలతో పని చేసిన యువ దర్శకుడిగా మరో ఘనత సాధిస్తారు.

News January 12, 2026

సీబీఐ విచారణకు విజయ్

image

కరూర్ తొక్కిసలాట కేసులో హీరో, టీవీకే చీఫ్ విజయ్ దళపతి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌లో అధికారులు ఆయనను విచారిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ 27న విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మరణించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

News January 12, 2026

మంత్రులు, అధికారులతో CM CBN కీలక భేటీ

image

AP: మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, పారదర్శక పాలన, మెరుగైన ప్రజా సేవలపై ఆయన సమీక్షిస్తున్నారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాస్ పుస్తకాలపైనా చర్చించనున్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు కూడా వర్చువల్‌గా హాజరుకానున్నారు.