News July 5, 2025
TODAY HEADLINES

☛ 100 MLA, 15 MP సీట్లు గెలుస్తాం: TG CM రేవంత్
☛ వారసత్వ భూములకు సెక్షన్ సర్టిఫికెట్లు: AP CM చంద్రబాబు
☛ BJP, RSSలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్లు ఉన్నారా?: ఖర్గే
☛ మేమెప్పుడూ TDPని తక్కువ చేసి మాట్లాడలేదు: పవన్
☛ కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు: BRS
☛ రెడ్ బుక్తో AP రక్తమోడుతోంది: YS జగన్
☛ తమిళనాడు: సీఎం అభ్యర్థిగా హీరో విజయ్
☛ రెండో టెస్ట్: ఇంగ్లండ్ ఆలౌట్, సిరాజ్కు 6 వికెట్లు
Similar News
News November 22, 2025
APR 1 నుంచి యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్: సీఎం

AP: క్యాబినెట్ ఆమోదం తెలిపిన యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ విధానాన్ని 2026 APR 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం NTR వైద్య సేవ ద్వారా ఏ ప్రాంతంలో, ఏ వ్యాధికి ఎంత ఖర్చు చేస్తున్నామో విశ్లేషించాలని సూచించారు. కాగా కొత్త పథకంతో 1.63 కోట్ల కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు నగదు రహిత వైద్యం, అందులో 1.43 కోట్ల BPL కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల ఉచిత వైద్యం అందుతుంది.
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <
News November 22, 2025
రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ బీమా యోజనలో మార్పులు!

PM ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై జంతువుల దాడి, వరదలు/నీట మునగడం వల్ల పంట నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వనుంది. ఇప్పటిదాకా కరవు, వడగళ్లు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులే స్కీమ్లో ఉండేవని, కొత్తగా ఈ రెండింటిని చేర్చామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు.


