News October 22, 2024

TODAY HEADLINES

image

AP: దీపావళి నుంచి ఫ్రీ సిలిండర్లు: సీఎం చంద్రబాబు
☛ పవన్ కళ్యాణ్‌కు HYD సిటీ సివిల్ కోర్టు సమన్లు
☛ అమరావతికి హడ్కో రూ.11వేల కోట్ల నిధులు: ఏపీ ప్రభుత్వం
☛కష్టాల్లో ప్రజలు.. సుఖాల్లో చంద్రబాబు: YCP
TG: తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-1 మెయిన్స్
☛ గ్రూప్-1 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
☛ అమరులైన కానిస్టేబుల్ కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సీఎం రేవంత్
☛ జీవో 29పై న్యాయపోరాటం చేస్తాం: KTR

Similar News

News January 14, 2026

గిల్ మినహా టాపార్డర్ విఫలం

image

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత టాపార్డర్ విఫలమైంది. కెప్టెన్ గిల్(56) మినహా రోహిత్(24), కోహ్లీ(23), అయ్యర్(8) నిరాశపర్చారు. ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 70 పరుగులు నమోదు చేసింది. 99 రన్స్ వద్ద రెండో వికెట్ కోల్పోగా 19 పరుగుల వ్యవధిలోనే 3 కీలక వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. NZ బౌలర్ క్లర్క్ 3 వికెట్లతో చెలరేగారు. 26 ఓవర్లో భారత్ స్కోరు 125-4.

News January 14, 2026

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదా?

image

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదు. సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే ఓ దివ్య నక్షత్రాన్ని మకర జ్యోతి అంటారని, ఇది ప్రకృతి సిద్ధమైనదని శబరిమల ప్రధానార్చకులు తెలిపారు. అదే సమయంలో పొన్నంబళమేడు కొండపై మూడు సార్లు ఓ హారతి వెలుగుతుంది. ఈ దీపారాధనను స్థానిక గిరిజనులు చేస్తారని దేవాలయ సిబ్బంది చెబుతోంది. ఈ హారతినే మకర విళక్కుగా భావిస్తారు. ఇది మానవ నిర్మితమని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసింది.

News January 14, 2026

ఇంటర్వ్యూతో BARCలో ఉద్యోగాలు

image

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<>BARC<<>>) 3 పోస్టులను భర్తీ చేయనుంది. MBBS, MD/MS/DNB ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం గల అభ్యర్థులు జనవరి 22న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. నెలకు రూ.92వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://barc.gov.in