News October 23, 2024

TODAY HEADLINES

image

AP: విజయవాడలో డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు
☛ 15 రోజుల్లో డ్రోన్ పాలసీ: సీఎం చంద్రబాబు
☛ ఇక నుంచి వాట్సాప్‌లో పౌర‌సేవ‌లు.. మెటాతో AP ప్రభుత్వం ఒప్పందం
TG: జూనియర్ లెక్చరర్ ఫలితాలు విడుదల
☛ రేపు ప్రియాంకా గాంధీ నామినేషన్.. కేరళకు CM రేవంత్
☛ పొలిటికల్ బాసులు పోలీసులకు స్వేచ్ఛనివ్వాలి: KTR
☛ దేశవ్యాప్తంగా CRPF స్కూళ్లకు బాంబు బెదిరింపులు
☛ పుతిన్‌తో మోదీ భేటీ.. కీలక అంశాలపై చర్చ

Similar News

News January 13, 2026

రైల్వేకు రూ.1.3 లక్షల కోట్లు!.. సేఫ్టీకి ప్రయారిటీ

image

రైలు ప్రమాదాల నివారణకు వీలుగా కేంద్రం రానున్న బడ్జెట్లో ప్రయాణికుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వనుందని ‘మింట్’ పేర్కొంది. ‘బడ్జెట్లో రైల్వేకు ₹1.3 లక్షల కోట్లు కేటాయించవచ్చు. ఇందులో సగం సేఫ్టీకి ఖర్చు చేస్తారు. ట్రాక్‌ల పునరుద్ధరణ, సిగ్నలింగ్ అప్‌గ్రేడ్, ఆటోమేటిక్ రక్షణ వ్యవస్థ కవచ్‌ను విస్తరిస్తారు’ అని తెలిపింది. కాగా ఇటీవల ప్రమాద ఘటనలపై రాజకీయ విమర్శలతో కేంద్రం రైల్వేపై దృష్టి సారించింది.

News January 13, 2026

గ్రామ పంచాయతీలకు తీపి కబురు.. రూ.277 కోట్లు విడుదల

image

TG: సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో రూ.277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సంద‌ర్భంగా స‌ర్పంచ్‌ల‌ు, వార్డు మెంబ‌ర్ల‌కు భట్టి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

News January 13, 2026

షాక్స్‌గామ్ వ్యాలీ.. భారత్‌కు ఎందుకంత కీలకం?

image

<<18842137>>షాక్స్‌గామ్ వ్యాలీ<<>> భారత్‌కు భౌగోళికంగా, రక్షణ పరంగా చాలా కీలకం. ఇది ప్రస్తుతం చైనా అధీనంలో ఉంది. భారత్ మాత్రం దీన్ని తన భూభాగంగానే పరిగణిస్తోంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధక్షేత్రం సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలో ఉంటుంది. ఇక్కడ శత్రువులకు పట్టు చిక్కితే లద్దాక్‌లోని సైనిక కదలికలను ఈజీగా గమనించొచ్చు. ఈ ప్రాంతం ద్వారా చైనా, పాక్ మధ్య రాకపోకలు పెరిగి ఒకేసారి భారత్‌పై దాడి చేసే ప్రమాదం పొంచి ఉంటుంది.