News November 4, 2024
TODAY HEADLINES

➣TG: బీసీ కులగణనకు డెడికేషన్ కమిటీ: సీఎం రేవంత్
➣AP: అనకాపల్లిలో 1.40 లక్షల కోట్లతో మిట్టల్ స్టీల్ ప్లాంట్: TDP
➣TG: సంక్రాంతి తర్వాత రేషన్‌లో సన్నబియ్యం: ఉత్తమ్
➣త్వరలో నూతన ఎనర్జీ పాలసీ: భట్టి విక్రమార్క
➣AP: పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తాం: మంత్రి అనిత
➣సూపర్ సిక్స్ కాదు.. సూపర్ చీటింగ్: రోజా
➣2027లోనే మళ్లీ ఎన్నికలు: VSR
➣మధ్యంతర భృతి ప్రకటించాలి: ఏపీ జేఏసీ
Similar News
News February 14, 2026
మార్చి నుంచి చకచకా ‘వాహన్’ సేవలు

TG: వాహన యజమానులకు అందించే సేవలు మెరుగుపర్చేలా ప్రభుత్వం మార్చిలో ‘వాహన్‘ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రిజిస్ట్రేషన్, లైసెన్స్ పునరుద్ధరణ, ఫీజుల చెల్లింపు, చిరునామాల మార్పు వంటి ఆన్లైన్ సేవలన్నీ ఈ పోర్టల్ ద్వారా అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ‘సారథి’ పోర్టల్‌లోని సర్వీసులు దీనిలోనూ ఉంటాయి. ప్రస్తుతం SEC, HYD RTOలలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తేనున్నారు.
News February 14, 2026
శివరాత్రి మరునాడు ఆప్షనల్ హాలిడే

AP: మహాశివరాత్రి పర్వదినం ఈ నెల 15(ఆదివారం) నాడు ఉంది. ఆ మరునాడు అంటే సోమవారం ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ ఇవాళ జీవో విడుదల చేసింది. శివరాత్రి భక్తులు జాగారం చేయనున్నందున మరునాడు సెలవు తీసుకొనేలా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.
News February 14, 2026
గతేడాది మాదిరే ఉంది.. బడ్జెట్‌పై బుగ్గన విమర్శలు

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ‘బడ్జెట్ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారు. సూపర్-6 అంటూ అధికారంలోకి వచ్చి వాటికి కేటాయింపులు లేవు. బడ్జెట్లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్ బుక్ చూసినట్లే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పలేదు. ఏయే రంగాలకు ఎంత కేటాయించారో వెల్లడించలేదు’ అని వ్యాఖ్యానించారు.


