News November 7, 2024
TODAY HEADLINES

* అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఘన విజయం
* భూమి కబ్జా చేస్తే 10-14 జైలుశిక్ష.. ఏపీ క్యాబినెట్ నిర్ణయం
* కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ భేటీ
* మందకృష్ణతో పవన్ను తిట్టించింది చంద్రబాబే: VSR
* తెలంగాణలో కులగణన సర్వే ప్రారంభం
* కులగణన సిబ్బందికి ప్రజలు అందుబాటులో ఉండాలి: భట్టి
* కాంట్రాక్టులన్నీ సీఎం బామ్మర్ది, పొంగులేటికే: కేటీఆర్
* పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం ఆమోదం
Similar News
News October 28, 2025
IRCTCలో 45 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

IRCTC 45 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 15 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్సైట్: https://irctc.com/
News October 28, 2025
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలంటూ కర్ణాటక ప్రభుత్వమిచ్చిన ఆర్డర్స్పై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, దీని వల్ల పది మంది పార్కులో పార్టీ చేసుకున్నా నేరమే అవుతుందని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. కోర్టు విచారణను NOV 17కు వాయిదా వేసింది. కాగా RSSను కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఈ ఆర్డరిచ్చిందని విమర్శలొచ్చాయి.
News October 28, 2025
మొంథా తుఫాన్.. వాహనదారులకు బిగ్ అలర్ట్

AP: మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో భారీ వాహనదారులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వాహనదారులు ముందే సురక్షిత ‘లేబే’ల్లో వాటిని పార్క్ చేసుకోవాలని సూచించింది. అటు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని మరోసారి హెచ్చరించింది.


