News November 9, 2024

TODAY HEADLINES

image

☛ TG: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట.. సీఎం రేవంత్ ఆదేశం
☛ బీఆర్ఎస్ నేతలకు త్వరలో సినిమా చూపిస్తాం: సీఎం రేవంత్
☛ తెలంగాణ రాకపోతే రేవంత్ సీఎం అయ్యేవాడా?: హరీశ్ రావు
☛ AP: త్వరలో వాట్సాప్ ద్వారా వంద పౌర సేవ‌లు: మంత్రి లోకేశ్
☛ జగన్‌ను తిట్టే వారిపై ప్రభుత్వ చర్యలేవీ?: అంబటి రాంబాబు
☛ అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల
☛ INDvsSA: సంజూ శాంసన్ సెంచరీ

Similar News

News November 21, 2025

నిఖత్ జరీన్ ప్రపంచ వేదికపై దేశ కీర్తిని చాటారు: రేవంత్

image

TG: ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్‌లో <<18345257>>స్వర్ణ పతకం<<>> సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్‌ను CM రేవంత్ రెడ్డి అభినందించారు. అద్భుత ప్రతిభతో మరోసారి ప్రపంచ వేదికపై దేశకీర్తిని నలుదిశలా చాటారని ప్రశంసించారు. ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో నిఖత్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని అన్నారు. తెలుగు జాతి గౌరవాన్ని నిఖత్ ఖండాంతరాలు దాటించారని మంత్రి పొన్నం ప్రభాకర్ మెచ్చుకున్నారు.

News November 21, 2025

రేపటి నుంచి వారి ఖాతాల్లో నగదు జమ

image

AP: విశాఖ(D) తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం భూములిచ్చిన రైతులకు రేపటి నుంచి పరిహారం అందజేయనున్నట్లు భీమిలి MLA గంటా శ్రీనివాసరావు తెలిపారు. నేరుగా రైతుల అకౌంట్లలోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు. రైతుల అభ్యర్థన మేరకు ఎకరాకు నిర్ణయించిన ₹17 లక్షల ధరను ప్రభుత్వం ₹20 లక్షలకు పెంచిందని చెప్పారు. రైతుల భూములకు ఎక్కువ ధర ఇస్తామని తప్పుదోవ పట్టిస్తున్న దళారులపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని హెచ్చరించారు.

News November 21, 2025

డైరెక్షన్‌పై అల్లరి నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

image

డైరెక్షన్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందని నటుడు అల్లరి నరేశ్ అన్నారు. తాను తెరకెక్కించే సినిమా ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’లా ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చెప్పారు. తాను నటించిన తొలి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘12ఏ రైల్వే కాలనీ’ అని, వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందని తెలిపారు. సమాంతరంగా మూడు నాలుగు కథలు జరుగుతుంటాయని చెప్పారు. ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ కానుంది.