News November 10, 2024

TODAY HEADLINES

image

☛ TGపై మోదీ అబద్ధాల ప్రచారం: CM రేవంత్
☛ వచ్చే ఎన్నికల్లో వందశాతం BRSదే గెలుపు: KCR
☛ TGలో సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం
☛ విజయవాడ-శ్రీశైలం సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభం
☛ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే వదలం: CM CBN
☛ తప్పుడు ప్రచారం చేస్తున్న చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: జగన్
☛ మహారాష్ట్రలో మహాయుతి హవా నడుస్తోంది: మోదీ

Similar News

News December 3, 2025

వేగంగా కాదు.. క్షేమంగా వెళ్లండి: సిద్దిపేట సీపీ

image

వేగంగా వెళ్లడం కాదు.. క్షేమంగా వెళ్లడం ముఖ్యమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.ఎం.విజయ్ కుమార్ పేర్కొన్నారు. అతివేగం ఎప్పటికైనా ప్రమాదమే అని, వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని కోరారు. మీ నిర్లక్ష్యం ఇతరులకు శాపం కావద్దన్నారు. మీ క్షేమం కోసమే ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అతివేగంతో వెళ్లి మీ కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని అన్నారు.

News December 3, 2025

ధోనీ రూమ్‌లో చాలా చేసేవాళ్లం: మైక్ హస్సీ

image

క్రికెట్‌ మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉండే ధోనీ ఆఫ్‌ఫీల్డ్‌లో ఎలా ఉంటారో CSK మాజీ ఆటగాడు, కోచ్ హస్సీ వెల్లడించారు. ప్రతి IPL సీజన్‌లో ధోనీ రూమ్‌ అనధికారిక టీమ్ లాంజ్‌లా మారేదన్నారు. ప్లేయర్లు 24 గంటలూ అక్కడే మాట్లాడుకోవడం, ఫుడ్ షేర్ చేసుకోవడం, కొందరు హుక్కాతో రిలాక్స్ అవ్వడం జరిగేదన్నారు. ఇటువంటి బాండింగ్‌ కారణంగానే CSK ఒక కుటుంబంలా మారిందని అభిప్రాయపడ్డారు.

News December 3, 2025

సమంతతో పెళ్లిపై రాజ్ సోదరి ఎమోషనల్ పోస్ట్!

image

సమంతను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ రాజ్ నిడిమోరు సోదరి శీతల్ ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘చంద్రకుండ్‌లో శివుడిని ప్రార్థిస్తూ లింగాన్ని ఆలింగనం చేసుకున్నా. ఆనందబాష్పాలతో నా హృదయం ఉప్పొంగుతోంది. ఇప్పుడు మా కుటుంబం పరిపూర్ణమైంది. వీరికి మేమంతా అండగా ఉంటాం. వాళ్లను చూస్తుంటే గర్వంగా ఉంది’ అని ఆమె రాసుకొచ్చారు. ‘లవ్ యూ’ అని సామ్ దీనికి రిప్లై ఇచ్చారు.