News November 13, 2024
TODAY HEADLINES

☛ ఏపీలో రిలయన్స్ రూ.65వేల కోట్ల పెట్టుబడులు
☛ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా RRR, చీఫ్ విప్‌గా ఆంజనేయులు
☛ ఏపీలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా
☛ అమృత్ టెండర్లపై ఆరోపణలు అవాస్తవం: సీఎం రేవంత్
☛ రేవంత్, పొంగులేటి పదవులు పోవడం ఖాయం: KTR
☛ వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో 16 మందికి రిమాండ్
☛ కర్ణాటక ప్రజల్ని కాంగ్రెస్ లూటీ చేస్తోంది: ప్రధాని మోదీ
Similar News
News March 13, 2026
కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి: కలెక్టర్

కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, బీసీ సంఘ సభ్యులు, ప్రజలు హాజరుకావాలని ఆయన సూచించారు.
News March 13, 2026
వార్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్‌తో పాటు వంట నూనెల ధరలకూ రెక్కలొచ్చాయి. వివిధ రకాల నూనెల రేట్లు గత వారంతో పోలిస్తే కేజీపై ₹1-4 వరకు పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ ₹4, పామ్ ఆయిల్ ₹2.50, గ్రౌండ్నట్ ఆయిల్ ₹2, సోయాబీన్, వనస్పతి ఆయిల్ ₹1 చొప్పున పెరిగాయి. దేశంలో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్‌లో దాదాపు 90 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం.
News March 13, 2026
సెలవు తేదీ మార్పు

AP: పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ‘షబే ఖద్ర్’ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆప్షనల్ సెలవును ఈ నెల 15 నుంచి 17వ తేదీకి ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు CS సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లో, ముఖ్యంగా బేసి సంఖ్య రోజుల్లో ఈ పండుగ జరుపుకుంటారు. ఖురాన్ అవతరించిన రాత్రిగా దీన్ని భావిస్తారు.


