News November 14, 2024

TODAY HEADLINES

image

☛ INDvsSA: మూడో టీ20లో తిలక్ వర్మ సెంచరీ
☛ త్వరలో హిందీ, తెలుగు మీడియంలలోనూ వైద్యవిద్య: PM మోదీ
☛ TG: వికారాబాద్ కలెక్టర్‌పై కుట్రపూరితంగానే దాడి: భట్టి
☛ TG: DSC స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు మరోసారి సర్టిఫికెట్ వెరిఫికేషన్
☛ లగచర్ల కేసు: పట్నం నరేందర్ రిమాండ్ రిపోర్టులో KTR పేరు
☛ AP: త్వరలోనే DSC నోటిఫికేషన్: అసెంబ్లీలో నారా లోకేశ్
☛ AP: చంద్రబాబుకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలి: జగన్

Similar News

News January 13, 2026

త్వరలో చిరంజీవితో సినిమా చేస్తా: మారుతి

image

త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయనున్నట్లు ‘రాజాసాబ్’ డైరెక్టర్ మారుతి చెప్పారు. ‘‘రాజాసాబ్’ మూవీకి 3 ఏళ్ల కష్టం 3 గంటలు తీసి చూపిస్తే ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తున్నారు. త్వరలో వాళ్లే రియలైజ్ అవుతారు. నేనేమీ వారిని శపించట్లేదు. వారిపట్ల బాధ‌పడుతున్నా. రాజాసాబ్ రెండోసారి చూస్తే రైటింగ్‌లో లోతు తెలుసుకుంటారు. అర్థం చేసుకోవాలంటే మరోసారి చూడండి’’ అని మీడియా చిట్ చాట్‌లో అన్నారు.

News January 13, 2026

ఇరాన్ నిరసనల్లో 12 వేల మంది చనిపోయారా?

image

ఇరాన్ నిరసనల్లో 2వేల మంది <<18846903>>చనిపోయారని<<>> వార్తలు వచ్చాయి. కానీ అక్కడి ప్రతిపక్షాలు మాత్రం భద్రతా దళాల కాల్పుల్లో 12వేల మంది చనిపోయారని సంచలన ఆరోపణలు చేశాయి. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద మారణకాండ అని, లెక్కలోకి రాని మరణాలు వందల్లో ఉండొచ్చని Iran International సంస్థ చెప్పింది. ఈనెల 8, 9తేదీల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, బాసిజ్ యూనిట్లు చేసిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయారని తెలిపింది.

News January 13, 2026

త్వరలో 10వేల పోస్టుల భర్తీ: మంత్రి దామోదర

image

TG: త్వరలోనే ఆరోగ్యశాఖలో 10వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. HYD కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు ఆరోగ్యశాఖలో 9,572 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. జంట నగరాల్లో 145 పాలిక్లినిక్‌లు, రాష్ట్రంలో 80 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆరోగ్యభద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు.