News November 21, 2024
TODAY HEADLINES
✒ EXIT POLLS: మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో BJPకే మొగ్గు
✒ మోదీకి గయానా, బార్బడోస్ అత్యున్నత పురస్కారాలు
✒ AP: ఢిల్లీలో మన పరపతి వేరే లెవెల్: CBN
✒ AP: CBN పాలనపై విశ్వాసం ఉంది: పవన్
✒ AP: వాలంటీర్లు వ్యవస్థలో లేరు: మంత్రి డోలా
✒ AP: రాష్ట్ర రోడ్లపై టోల్ వసూలా?: జగన్ ఆగ్రహం
✒ TG: గిగ్ వర్కర్స్ పాలసీని సమగ్రంగా మారుస్తాం: CM
✒ TG: KTR ఊచలు లెక్కపెడతారు: రేవంత్
✒ TG: రేవంత్‌కు KCR భయం పట్టుకుంది: హరీశ్
Similar News
News November 26, 2024
మినీ బస్సు బోల్తా.. ఆరుగురు ‘కాంతార’ నటులకు గాయాలు
‘కాంతార: ఛాప్టర్-1’ సిబ్బంది ప్రయాణిస్తున్న ఓ మినీ బస్సు బోల్తా పడటంతో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటక జడ్కల్‌లోని ముదూర్‌లో షూటింగ్ ముగించుకుని కొల్లూరుకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. అది చిన్న ప్రమాదమేనని, యథావిధిగా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు మూవీ టీమ్ వెల్లడించింది.
News November 26, 2024
నేడు ‘రాజ్యాంగ దినోత్సవం’.. ఎందుకంటే?
మన రాజ్యాంగానికి 1949 NOV 26న ఆమోదం లభించినా స్వాతంత్ర్యం ఇస్తామని బ్రిటీషర్లు మభ్యపెట్టడంతో అమలుకు 2నెలలు పట్టింది. అంతకముందు నెహ్రూ తక్షణ స్వాతంత్ర్యానికి 1929 DEC 31న జెండాను ఎగరేశారు. ఆపై 1930 జనవరి 26న సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించి 1950లో అదే రోజు రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు. 2015న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ 125జయంతి సంవత్సరం సందర్భంగా PM మోదీ నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు.
News November 26, 2024
బంగ్లాలో ‘ఇస్కాన్’ నిర్వాహకుడు కృష్ణదాస్ ప్రభు అరెస్ట్
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతున్న వేళ ఇస్కాన్ ఆలయ నిర్వాహకుడు శ్రీచిన్మయ్ కృష్ణదాస్ ప్రభును బంగ్లా ప్రభుత్వం అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఢాకా ఎయిర్‌పోర్ట్ వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు డిటెక్టివ్ బ్రాంచ్ ఆఫీస్‌కి తరలించారు. అయితే ఈ విషయాన్ని మహ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లా ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదు. కాగా బంగ్లాలో హిందువులపై దాడులపై కృష్ణదాస్ పోరాడుతున్నారు.