News November 22, 2024
TODAY HEADLINES

✒ లంచం ఆరోపణలు.. అదానీపై USలో కేసు
✒ అదానీని అరెస్ట్ చేస్తే మోదీ పేరు బయటికి: రాహుల్
✒ AP: భూమిని ఆక్రమిస్తే బయట తిరగలేరు: CBN
✒ AP: స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటాం: పవన్
✒ APలో NTCP రూ.1.87L cr పెట్టుబడులు
✒ TG: మండలానికి 2 అంబులెన్సులు: మంత్రి రాజనర్సింహ
✒ TG: DEC 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు
✒ TG: లగచర్ల కేసు: CS, DGPకి NHRC నోటీసులు
✒ TG: 29న రాష్ట్రవ్యాప్తంగా BRS దీక్షా దివస్: KTR
Similar News
News January 10, 2026
‘జన నాయగన్’ వాయిదా.. రీరిలీజ్‌తో వస్తోన్న విజయ్

జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడటంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు దళపతి విజయ్ గుడ్‌న్యూస్ చెప్పారు. సూపర్‌హిట్ సినిమా తేరీ (తెలుగులో పోలీసోడు)ను JAN 15న తమిళనాడులో రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ వి.క్రియేషన్స్ SMలో ప్రకటించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.
News January 10, 2026
సంక్రాంతి సెలవులు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సంక్రాంతి అనగానే అంతా సొంతూళ్లకు వెళ్తూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే ఇళ్లలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. క్యాష్, నగలు ఉంటే బ్యాంక్ లాకర్లలో దాచుకోండి. మీరు ఊరు వెళ్తున్న విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయండి. మీ ట్రావెల్‌కు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ని సోషల్ మీడియాలో షేర్ చేయకండి. మీ ఇంటి దగ్గర పరిస్థితిపై మీకేమైనా అనుమానం వస్తే వెంటనే డయల్ 100కి కాల్ చేయండి.
News January 10, 2026
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ: జనసేన

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సాధ్యమైనన్ని స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున ప్రతీ జనసైనికుడు, వీరమహిళ ప్రచారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చింది. త్వరలో ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొంది.


